Ammante Premaku Roopam

అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం
సతి అంటే సహకారం
మగడంటే మమకారం
ఇల్లు స్వర్గసీమ
ఇంటిపేరు ప్రేమ
ఇల్లు స్వర్గసీమ
ఇంటిపేరు ప్రేమ
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం

అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం

తోడునీడ తోటలో తోటమాలి సేవలో
పువ్వులారబోసుకున్నా యవ్వనాలలో
ముద్దు చల్లారబెట్టుకున్న సిగ్గు
ఇల్లు తెల్లారి పెట్టుకున్న ముగ్గు
వాంఛ రెట్టింపు చేసుకున్న వద్దు
కొత్త దాంపత్య భావాలు విద్దు
పాల మీద మల్లెపూలు
పంచుకున్నా జీవితాలు ప్రేమలో
ఎన్నటిదో అనుబంధం యదనిండా మకరందం

అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం

బాటసారి యాత్రలో బారసాల ఈ దినం
కోకిలమ్మ పాడుతున్న జోల పాటలో
పుల్లమావిల్లు తీపి తేనె కన్నా
మల్లెపూలేమో ముళ్ళు పక్కలోన
కల్పవృక్షాన్ని నిన్ను కట్టుకున్నా
వంశవృక్షాన్ని నేను పెంచుకున్నా
జంటలైన పావురాలు
కలలుగన్న కాపురాల జోరులో
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం

అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం
సతి అంటే సహకారం
మగడంటే మమకారం
ఇల్లు స్వర్గసీమ
ఇంటిపేరు ప్రేమ
ఇల్లు స్వర్గసీమ
ఇంటిపేరు ప్రేమ
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం

అమ్మంటే
ప్రేమకు రూపం
నాన్నంటే
ఆమెకు దీపం



Credits
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link