Chali Gaali Chuudduu

చలిగాలి చూద్దూ తెగ తుంటరి
గిలిగింత పెడుతున్నది
పొగమంచు చూద్దూ మహ మంచిది
తెరచాటు కడుతున్నది

నన నన్నాన నన్నాన కథ ఏమిటి
నన నన్నాన నన్నాన తెలుసా మరి
ఇక ఈపైన కానున్న కథ ఏమిటి
అది నీకైన నాకైన తెలుసా మరి
అయినా వయసిక ఆగేనా
మనమిక మోమాట పడకూడదంటున్నది

చలిగాలి చూద్దూ తెగ తుంటరి
గిలిగింత పెడుతున్నది
పొగమంచు చూద్దూ మహ మంచిది
తెరచాటు కడుతున్నది

ఎటు పోతున్నాం అని అడిగామా
ఎదురుగ వచ్చే దారేదైనా
ఏమైపోతాం అనుకున్నామా
జత పరుగుల్లో ఏం జరిగినా
శ్రుతిమించే సరాగం ఏమన్నది
మనమిక మోమాటపడకూడదంటున్నది

చలిగాలి చూద్దూ తెగ తుంటరి
గిలిగింత పెడుతున్నది
పొగమంచు చూద్దూ మహ మంచిది
తెరచాటు కడుతున్నది

కలతే ఐనా కిలకిలమనదా
మన నవ్వులలో తానూ చేరి
నడిరేయైనా విలవిలమనదా
నిలువున నిమిరి ఈడావిరి
మతిపోయేంత మైకం ఏమన్నది
మనమిక మోమాటపడకూడదంటున్నది

పొగమంచు చూద్దూ మహ మంచిది
తెరచాటు కడుతున్నది
చలిగాలి చూద్దూ తెగ తుంటరి
గిలిగింత పెడుతున్నది



Credits
Writer(s): Mani Sarma, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link