Odonu Jaripe

ఓడను జరిపే ముచ్చట కనరే వనితలారా నేడు
ఓడను జరిపే ముచ్చట కనరే వనితలారా నేడు
ఆడువారు యమున కాడ
ఆడువారు యమున కాడ కృష్ణుని కూడి ఆడుచు పాడుచు అందరు చూడగ
ఓడను జరిపే ముచ్చట కనరే

వలపుతడి తిరనాలే పొంగిన ఏటి కి అందం కెరటాలకు వయ్యారం కరిగే తీరం
తిలకమిడే కిరణాలే పొద్దుటి తూరుపుకందం చినదానికి సింగారం సిగ మందారం
పదాల మీదే పడవ పెదాలు కోరే గొడవ
యదల్లో మోగే దరువే కదం గా నావే నడవా
ఇలా నీలాటి రేవులో
ఓడను జరిపే ముచ్చట కనరే వనితలారా నేడు
ఓడను జరిపే ముచ్చట కనరే వనితలారా నేడు

చిలిపి తడి వెన్నెలలే గౌతమి కౌగిలికందం తొలి చూలుకు శ్రీకారం నడకే భారం
ఉలికిపడే ఊయలలే కన్నుల పాపలకందం నెలవంకల సీమంతం ఒడిలో దీపం
తరాలు మారే జతలే స్వరాలు పాడే కధలో
సగాలై పోయే మనువే సృజించే మూడో తనువే
త్యాగయ్యరామ లాలి లో

ఓడను జరిపే ముచ్చట కనరే వనితలారా నేడు
ఓడను జరిపే ముచ్చట కనరే



Credits
Writer(s): M. M. Keeravani, Veturi Sundararama Murthy
Lyrics powered by www.musixmatch.com

Link