Nadi Dhanakshetram

నాది ధనక్షేత్రం నా గెలుపే ఖాయం
నాది ధనక్షేత్రం నా గెలుపే ఖాయం
అది ముందెపుడో నిర్ణయం
అది ముందెపుడో నిర్ణయం

నాది జనక్షేత్రం జనతీర్పు శిరోధార్యం
నాది జనక్షేత్రం జనతీర్పు శిరోధార్యం
చరిత్రలో ఎపుడైనా
ప్రజల ఆమోదమే అజేయం
అదే అదే అదే ప్రజాస్వామ్యం
పూటకు గతిలేని పతిని
నోటుతో ఓడిస్తా
Depositలు దక్కకుండ విజయం నాదనిపిస్తా
నీతి అవినీతి మద్య
మంచి చెడు రెంటి నడుమ
సాగే ఎన్నిక రణ క్షేత్రంలో
ఆలుమగల నడుమ జరుగుతున్న
కని విని ఎరుగని కలియుగ కురుక్షేత్రంలో

నాది జనక్షేత్రం నాది జనక్షేత్రం
నాది జనక్షేత్రం నాది జనక్షేత్రం
నాది జనక్షేత్రం జనతీర్పు శిరోధార్యం
నాది ధనక్షేత్రం నా గెలుపే ఖాయం
పల్లె పల్లె కుర్రాళ్లకు
Cricket kit-u పంచేస్తా
IT hub-uతో software youthని కూడబెడతా
దిమ్మ దిరిగి పోయేలా
గూబ గుయ్యమనిపిస్తా
Assemblyలో అడుగేస్తా
ముఖ్యమంత్రిగ ముందుకొస్తా
Head వెంకట్రామయ్యతో salute కొట్టిస్తా
తాగుడుతో చెల్లెమ్మల తాళిబొట్లు తెగనివ్వను
నల్లడబ్బు చెత్తకాగితాలు మీద పడనివ్వను
దేశమంటే మట్టికాదు దేశమంటే యువకులని
ఆకర్షణ పథకాలకు అమ్ముడవరు నా తమ్ములు
ఓట్లు కొనాలనేవాళ్ళ మాడు పగిలిపోయేలా
ఎప్పుడెవరి కెక్కడ గుద్దాలో అక్కడ గుద్ది
గెలిపించే ప్రజలే నాకెప్పుడు దేవుళ్ళు

నాది జనక్షేత్రం నాది జనక్షేత్రం
నాది జనక్షేత్రం నాది జనక్షేత్రం
నాది జనక్షేత్రం జనతీర్పు శిరోధార్యం
నాది ధనక్షేత్రం నా గెలుపే ఖాయం
ఎన్నికలు వచ్చినపుడే దక్కినంత దండుకోండి
ఓటు మన జన్మ హక్కు నీతిని కాపాడాలి
దీపముండగానే ఇళ్ళు చక్కదిద్దుకోండి
చీకటి మూకలను తరిమే సూర్యుల్లై కదలిరండి
ఇప్పటికిప్పుడు మీరు అడిగింది ఇచ్చేస్తా
ఎవ్వరిని యాచించని వ్యక్తిత్వం నేర్పిస్తా
ఋణాలన్ని మాఫీచేసి ధన బంధం నేనౌతా
నా భార్యా నా పిల్లలు నా కుటుంబమనికాదు
ప్రజలంతా నా సొంత కుటుంబంగా భావిస్తా
నల్లధనం కాగితాలు పనికిరాని చెత్తని
ధర్మాన్ని గెలిపిస్తే ధర్మబద్ధుడై ఉంటా

నాది జనక్షేత్రం నాది జనక్షేత్రం
నాది జనక్షేత్రం నాది జనక్షేత్రం
నాది జనక్షేత్రం జనతీర్పు శిరోధార్యం
నాది జనక్షేత్రం జనతీర్పు శిరోధార్యం
జనతీర్పు శిరోధార్యం



Credits
Writer(s): Vandemataram Srinivas, Suddala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link