Merise Mabbula

మెరిసే మబ్బుల నుంచి
పున్నమల్లె నవ్వే నీకై
వరమై రాడా నీ నాన్న

మెరిసే మబ్బుల నుంచి
పున్నమల్లె నవ్వే నాకై
వరమై వస్తాడా నాన్న
తీయని ఊహల్లో తేలే
కథలు మాటలు చెప్పే
వరమై రాడా నీ నాన్న
పెదవులలో పలికేనులే మధురసరాగం
నువ్వు తొడిగే గాజులలో చిరు సంగీతం
ముద్దు ముద్దు మాటల్లోన విచ్చే పువ్వేనా
బుల్లి బుల్లి పాదం వెంట వచ్చే నీ నాన్న

మెరిసే మబ్బుల నుంచి
పున్నమల్లె నవ్వే నాకై
వరమై వస్తాడా నాన్న
వరమై వస్తాడా నాన్న

అందాలూ చిందేటి ముత్యాలు జుంకాలు ఊయాలు ఊగు వేళా
చల్లంగా బజ్జోవా మీ నాన్న ఒళ్ళోన వింటూ నీ జోల
ఆగు వరకల్లి నించేల మిన్నుల్లో చిందేయు సందడిలో
తారల్ని తాకేలా సాగిపోవాలంట పండు వెన్నెల్లో
పగలు రేయి ఒక నేనేల్లె
కాయనలి కనుపాపవై
మా నాన్న కురువాలి నింగి మబ్బై
గుండెల్లో దాచెంతగా ప్రేమంతా చూపాలి ఈ కొనపై

మెరిసే మబ్బుల నుంచి
పున్నమల్లె నవ్వే నీకై
వరమై రాడా నీ నాన్న

బొట్టు కాటుకెట్టి మంచి బట్టలేసి నాతో బడి దాక
బోలెడన్ని నాకు చిట్టి ముద్దులిస్తూ తోడే వస్తాడు
నీ నవ్వు చూసేటి మీ నాన్న కన్నుల్లో ఆనంద భాస్పాలే
నీ కంట నీరోస్తే ఆ గుండె లోతుల్లో నిత్యం మంటల్లె
పసితనం అంతా ఎదిగినా కానీ
మీ నాన్న ముందు నువ్వు విరియని తామర పువ్వేనంటా
ఎంత అల్లరినైనా కానీ అది ఒక కమ్మని దోబుచాట

మెరిసే మబ్బుల నుంచి
పున్నమల్లె నవ్వే నాకై
వరమై వస్తాడా నాన్న
పెదవులలో పలికేనులే మధురసరాగం
నువ్వు తొడిగే గాజులలో చిరు సంగీతం
ముద్దు ముద్దు మాటల్లోన విచ్చే పువ్వేనా
బుల్లి బుల్లి పాదం వెంట వచ్చే నీ నాన్న



Credits
Writer(s): A G Mani, Eldhose Alias, Biby Mathew, Jim Jacob
Lyrics powered by www.musixmatch.com

Link