Nuvvu Undipo

నువ్వుండిపో నా కళ్ళలోన
నువ్ నిండిపో నా కలలలోన
నువ్వుండిపో నా ఆశలోన
నువ్ నిండిపో నా శ్వాసలోన
నా మనసు పొంగిపోదా నువ్వన్న మాటకి
నీ మీద వాలిపోదా ఇలా మాటి మాటికి
మనసే ఎవరి మాట వినదే
వింటే దాన్ని మనసు అనరే
నచ్చిన మనసు ఎక్కడుంటే అక్కడే వాలుతుందిలే
మనసే ఎవరి మాట వినదే
వింటే దాన్ని మనసు అనరే
నచ్చిన మనసు ఎక్కడుంటే అక్కడే వాలుతుందిలే
నువ్వుండిపో నా కళ్ళలోన
నువ్ నిండిపో నా శ్వాసలోన

నా ప్రాణమాగను అంది, నీలోకి పరిగెడుతోంది
నీ గుండెలో ఏ మూలనో చోటివ్వమంటుంది
నా గుండె లోతుల్లోకి నువు తొంగి చూసిందేది
చూస్తే కద లోనున్నది నువ్వేనని తెలిసే
ఈ సంగతిప్పుడేగా చెప్పింది నీ మది
నా మనసు ఆగుతుందా చూస్తూ మరి
మనసే ఎవరి మాట వినదే
వింటే దాన్ని మనసు అనరే
నచ్చిన మనసు ఎక్కడుంటే అక్కడే వాలుతుందిలే
మనసే ఎవరి మాట వినదే
వింటే దాన్ని మనసు అనరే
నచ్చిన మనసు ఎక్కడుంటే అక్కడే వాలుతుందిలే

తొలిసారి పెదవుల పైన కురిసింది నవ్వుల వాన
తెలవారులు పులమారడం తొలిసారి చూస్తున్నా
ఒకసారి నిలబడుతున్నా
ఒకసారి తడబడుతున్నా
ప్రతిసారిది బాగుందని అలవాటు పడుతున్నా
నీతోటి ఈ ప్రయాణం సరికొత్తగున్నదే
నా మనసుకీ విధానం నచ్చిందిలే
మనసే ఎవరి మాట వినదే
వింటే దాన్ని మనసు అనరే
నచ్చిన మనసు ఎక్కడుంటే అక్కడే వాలుతుందిలే
మనసే ఎవరి మాట వినదే
వింటే దాన్ని మనసు అనరే
నచ్చిన మనసు ఎక్కడుంటే అక్కడే వాలుతుందిలే



Credits
Writer(s): Bhaskarbhatla Ravikumar, Mani Sarma
Lyrics powered by www.musixmatch.com

Link