Manishi Maara Ledhu (From "Gundaamma Katha")

వేషము మార్చెనూ హోయ్
భాషను మార్చెనూ హోయ్
మోసము నేర్చెనూ ఊ అసలు తానే మారెను
అయినా మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు
మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు
క్రూరమృగమ్ముల కోరలు తీసెను ఘోరారణ్యములాక్రమించెను
క్రూరమృగమ్ముల కోరలు తీసెను ఘోరారణ్యములాక్రమించెను
హిమాలయముపై జెండా పాతెను
హిమాలయముపై జెండా పాతెను
ఆకాశంలో షికారు చేసెను
అయినా మనిషి మారలేదూ ఆతని కాంక్ష తీరలేదు
పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను
పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను
వేదికలెక్కెను వాదము చేసెను
వేదికలెక్కెను వాదము చేసెను త్యాగమె మేలని బోధలు చేసెను
అయినా మనిషి మారలేదూ ఆతని బాధ తీరలేదూ
వేషమూ మార్చెనూ బాషనూ మార్చెనూ మోసము నేర్చెను తలలే మార్చెను
అయినా మనిషి మారలేదూ ఆతని మమత తీరలేదు
ఆ అహా అహా హహాహాహహా
ఓ ఒహొ హోహోహొహోహోహొహో
వు వుహు హూహూ



Credits
Writer(s): Pingali, N/a Ghantasala
Lyrics powered by www.musixmatch.com

Link