Jo Jo Laali (Version 1)

జో జో లాలీ జో జో జో
బజ్జోరా నా కన్నా లాలిజో
ఎవరయ్యా నీకన్నా లాలిజో
ఇల్లాలి లాలిజో
జోలాలి లాలిజో
ఈ ఇల్లాలి లాలి జో ఓ ఓ ఓ
జోలాలి లాలిజో
బజ్జోరా నా కన్నా లాలిజో
జోజో జోజో జోజో లాలి జో

ముద్దూ ముచ్చట తెలిసి
బతకరా ముద్దుల కన్నయ్యా
ముద్ద పప్పులా పప్పు సుద్దలా
మారకు చిన్నయ్యా
మింగటమే తెలుసూ కొందరి పెదవులకూ
ముద్దంటే అలుసూ ఆ మొద్దుల పెదవులకూ
బొమ్మలు అడిగే కన్నా
ఓ అమ్మను అడుగు కన్నా
బొమ్మలు అడిగే కన్నా
ఓ అమ్మను అడుగు కన్నా
అందాకా ఆపోద్దూ నీ గోలా
నే జోల పాడినా
బజ్జోర నా కన్నా లాలి జో
ఎవరయ్య నీ కన్నా లాలి జో
ఈ నాన్న పాడినా
మీ అమ్మ లాలి జో
ఈ నాన్న పాడినా
మీ అమ్మ లాలి జో
బజ్జోర నా కన్నా లాలి జో
జోజో జోజో జోజో లాలి జో

పెదవుల చివరి ముద్దులు మనకు
వద్దుర కన్నయ్యా
మంచిని మించిన ముద్దుల పదవులు
లేవుర చిన్నయ్యా
నవ్వర నా తండ్రి నకిలీ ప్రేమలకూ
నమ్మకు నా తండ్రి ఈ నవ్వే భామలనూ
కనిపించే ప్రతి బొమ్మా
కాదుర నాన్న అమ్మా
కనిపించే ప్రతి బొమ్మా
కాదుర నాన్న అమ్మా
నీకేలా ఈ గోలా ఈ వేళా
ఉయ్యాలలూగరా
బజ్జోర నా కన్నా లాలి జో
ఎవరయ్య నీ కన్నా లాలి జో
ఇల్లాలి లాలిజో
జోలాలి లాలిజో
ఈ ఇల్లాలి లాలిజో
జోలాలి లాలిజో

బజ్జోరా నా కన్నా లాలిజో
జోజో జోజో జోజో లాలి జో
లాలి జో లాలి జో లాలి జో



Credits
Writer(s): Sundara Ramamurthy Veturi, Nagendra Rajan
Lyrics powered by www.musixmatch.com

Link