Manishiko Sneham (From "Aathma Bandhuvu")

మనిషికో స్నేహం మనసుకో దాహం
మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానేకాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం
ఒక చిలక ఒద్దికయ్యింది మరో చిలక మచ్చికయ్యింది
వయసేమో మరిచింది మనసొకటై కలిసింది
కట్టగట్టి ఆపాలన్నా గంగ పొంగులాగేనా
ప్రేమలేని నాడీ నేల పువ్వులన్నీ పూచేనా
మనిషిలేని నాడు దేవుడైన లేడు
మంచిని కాచేవాడు దేవుడికి తోడు
మనిషికో స్నేహం మనసుకో దాహం
మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానేకాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం

వయసూ వయసు కలుసుకుంటే పూరిగుడిసే రాజనగరు
ఇచ్చుకోను పుచ్చుకోను ముద్దులుంటే పొద్దు చాలదు
ప్రేమ నీకు కావాలంటే పిరికివాడు కారాదు
గువ్వ గూడు కట్టే చోట కుంపటెట్టి పోరాదు
ఓర్వలేని సంఘం ఒప్పుకోదు నేస్తం
జాతిమత బేధాలన్నీ స్వార్థపరుల మోసం
మనిషికో స్నేహం మనసుకో దాహం
మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానేకాదు
లేనిదే జీవం లేదు జీవితం కానేకాదు



Credits
Writer(s): Ilayaraja, Acharya Atreya
Lyrics powered by www.musixmatch.com

Link