Rangulalo (From "Abhinandana")

రంగులలో కలవో
ఎద పొంగులలో కళవో
రంగులలో కలవో
ఎద పొంగులలో కళవో
నవశిల్పానివో, రతిరూపానివో
తొలి ఊహల ఊయలవో
రంగులలో కలవో
ఎద పొంగులలో కళవో

కాశ్మీర నందన సుందరివో
కాశ్మీర నందన సుందరివో
కైలాస మందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో
ఆమని పూచే యామినివో
మరుని బాణమో
మధుమాస గానమో
నవ పరిమళాల పారిజాత సుమమో

రంగులలో కలనై
ఎద పొంగులలో కళనై
నవశిల్పాంగినై, రతిరూపాంగినై
నీ ఊహల ఊగించనా
రంగులలో కలనై

ముంతాజు అందాల అద్దానివో
ముంతాజు అందాల అద్దానివో
షాజాను అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో
లైలా కన్నుల ప్రేయసివో
ప్రణయ దీపమో
నా విరహ తాపమో
నా చిత్రకళా చిత్ర చైత్ర రధమో

రంగులలో కలనై
ఎద పొంగులలో కళనై
నవశిల్పాంగినై, రతిరూపాంగినై
నీ ఊహల ఊగించనా
రంగులలో కలనై
ఎద పొంగులలో కళనై



Credits
Writer(s): Ilayaraja, Acharya Atreya
Lyrics powered by www.musixmatch.com

Link