Choosi Chudangane (From "Chalo")

చూసీచూడంగానే నచ్చేశావే
అడిగీఅడగకుండ వచ్చేశావే
నా మనసులోకి హో అందంగ దూకి

దూరందూరంగుంటూ ఏం చేశావే
దారంకట్టి గుండె ఎగరేశావే
ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి

తొలిసారిగా (తొలిసారిగా)
నా లోపల (నా లోపల)
ఏమయ్యిందో (ఏమయ్యిందో)
తెలిసేదెలా (తెలిసేదెలా)

నా చిలిపిఅల్లర్లు నా చిన్నిసరదాలు నీలోనూ చూశానులే
నీవంక చూస్తుంటే అద్దంలో నను నేను చూస్తున్నట్టే ఉందిలే 'హో

ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూవుంటే
ఆహా ఈ జన్మకి ఇదిచాలు అనిపిస్తోందే
నువు నాకంటపడకుండ నావెంటపడకుండ ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే

నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే
నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే
నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే

ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తొస్తావే
నిను చూడకుండ ఉండగలనా

నా చిలిపిఅల్లర్లు నా చిన్నిసరదాలు నీలోనూ చూశానులే
నీవంక చూస్తుంటే అద్దంలో నను నేను చూస్తున్నట్టే ఉందిలే 'హో



Credits
Writer(s): Bhaskara Bhatla, Mahati Swara Sagar
Lyrics powered by www.musixmatch.com

Link