Kalva Kane Kavala

కలవా కన్నె కలవా
శిలవా స్వర్ణ శిలవా
కొంటె చూపుల కలవాని
యవ్వన దేశపు యువరాణి
కౌగిలి కోసం అలుక ఎందుకే
పలుకే రాదా అలివేణి
మల్లియ నీవై చేరుకుంటే
మదన తాపం తీరదటే
చిలిపి ఆశ తలుపు తడుతుంటే
తనువే లయగా ఊగదటే
కలలు పంచే కలవాని
పెదవి పెదవి జతకాని
పలుకు కోసం పిలుపులెందుకే
మనసే నీదే మహరాణి
నింగిలోని చందమామ
నీటనున్న కలువ భామ
ఒకరికొకరు కబురు పంపే
సమయమిదియే సఖి
మనసార వినవే చెలి
పూవ్వుకుండే బరువు స్వల్పం
గాలికుండే బరువు స్వల్పం
కోడె వయస్సున కన్నె బరువు
బరువు కాదే చెలి
అతి స్వల్పమేనే చెలి
కనుల కెన్నడు కంటి పాప
బారమెన్నడు కానే కాదు
నీ చిలిపి నగవు చూస్తువుంటే
అలుపు సొలుపు దరికిరావు
కనుల కెన్నడు కంటి పాప
బారమెన్నడు కానే కాదు
నీ చిలిపి నగవు చూస్తువుంటే
అలుపు సొలుపు దరికిరావు
నిన్ను నేను ఎత్తుకుంటే
ఉడుకు వయసు ఒణికెనే
నిన్ను నేను హత్తుకుంటే
నింగి నేలా కలిసేనే
నీమీదొక్క చూపు పడినా
ఎదలో మంట రగిలేనే
కొంటె చూపుల కలవాని
యవ్వన దేశపు యువరాణి
కౌగిలి కోసం అలుక ఎందుకే
పలుకే రాదా అలివేణి
కలలు పంచే కలవాని
పెదవి పెదవి జతకాని
వలపు కోసం పిలుపు ఎందుకే
మనసే నీదే మహరాణి

కలవా కన్నె కలవా
శిలవా స్వర్ణ శిలవా



Credits
Writer(s): Bhuvanchandra Bhuvanchandra, Rahman R
Lyrics powered by www.musixmatch.com

Link