Vayyari Godaramma - From "Preminchu Pelladu"

వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో కలవరింతే కౌగిలింతై.
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
నిజము నా స్వప్నం
అహా
కలనో
ఓహో
లేనో
ఓహో హో
నీవు నా సత్యం
అహా
అవునో
ఓహో
కానో
ఓహో
హో
ఊహ నీవే
ఆహాహాహా
ఉసురుకారాదా
ఆహా
మోహమల్లె
ఆహాహాహా
ముసురుకోరాదా
ఆహా
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ మువ్వగోపాలుని రాధికా
ఆకాశవీణ గీతాలలోన ఆలాపనై నే కరిగిపోనా
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

తాకితే తాపం
ఓహో
కమలం
ఓహో
భ్రమరం
ఓహో హో
సోకితే మైకం
ఓహో
అధరం
ఓహో
మధురం
ఓహో హో
ఆటవెలది
ఆహాహాహా
ఆడుతూరావే
హా ఆఅ
తేటగీతి
ఆహాహా హా
తేలిపోనీవే
హా ఆ
పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుక
చుంబించుకున్న బింభాధరాల సూర్యోదయాలే పండేటి వేళ
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో కలవరింతే కౌగిలింతై.
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

సాహిత్యం: వేటూరి



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link