Prema Lekha

ప్రేమలేఖ రాశా నీకంది ఉంటదీ
పూల బాణమేశా ఎదకంది ఉంటదీ
నీటి వెన్నెలా వేడెక్కుతున్నదీ
పిల్ల గాలికే పిచ్చెక్కుతున్నదీ
మాఘమాసమా వేడెక్కుతున్నదీ
మల్లె గాలికే వెర్రెక్కుతున్నదీ
వస్తే గిస్తే వలచీ వందనాలు చేసుకుంట
హంసలేఖ పంపా నీకంది ఉంటదీ
పూలపక్క వేశా అది వేచి ఉంటదీ

ఆడ సొగసు ఎక్కడుందొ చెప్పనా
అందమైన పొడుపు కథలు విప్పనా
కోడెగాడి మనసు తీరు చెప్పనా
కొంగుచాటు కృష్ణ కథలు విప్పనా
సత్యభామ అలకలన్ని పలకరింతలే అన్నాడు ముక్కుతిమ్మనా
మల్లె తోట కాడ ఎన్ని రాసలీలలో అన్నాడు భక్త పోతనా
వలచి వస్తినే వసంతమాడవే
సరసమాడినా క్షమించలేనురా
వలచి వస్తినే వసంతమాడవే
సరసమాడినా క్షమించలేనురా
కృష్ణా గోదారుల్లో ఏది బెస్టొ చెప్పమంట
హంస లేఖ పంపా నీకంది ఉంటదీ
పూల బాణమేశా ఎదకంది ఉంటదీ

మాఘమాస వెన్నెలెంత వెచ్చనా మంచి వాడివైతె నిన్ను మెచ్చనా
పంటకెదుగుతున్న పైరు పచ్చనా పైట కొంగు జారకుండ నిలుచునా
సినీమాల కథలు వింటె చిత్తు కానులే చాలించు నీ కథాకళీ
ఆడవారి మాటకు అర్థాలే వేరులే అన్నాడు గ్రేటు పింగళీ
అష్ట పదులతో అలాగ కొట్టకూ
ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే
అష్ట పదులతో అలాగ కొట్టకూ
ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే
నుయ్యొ గొయ్యొ ఏదో అడ్డదారి చూసుకుంట
ప్రేమలేఖ రాసా నీకంది ఉంటదీ
పూలపక్క వేశా అది వేచి ఉంటదీ



Credits
Writer(s): Veturi Sundararama Murthy, Chakravarthi
Lyrics powered by www.musixmatch.com

Link