Nandikonda

ఓ ఓ ఓ ఓ
నందికొండ వాగుల్లోన, నల్లతుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన, సందెపొద్దు సీకట్లో
నీడల్లే ఉన్నా, నీతో వస్తున్నా
నా ఊరేది? ఏది?
నా పేరేది? ఏది?
నా దారేది? ఏది?
నా వారేరి
ఓ ఓ ఓ ఓ

ఏనాడో ఆరింది నా వెలుగు
నీ దరికే నా పరుగు
ఆనాడే కోరాను నీ మనసు
నీ వరమే నన్నడుగు
మోహిని పిశాచి నా చెలిలే
శాకిని విషూచి నా సఖిలే
మోహిని పిశాచి నా చేలిలే
శాకిని విషూచి నా సఖిలే
విడవకురా వదలనురా
ప్రేమేరా నీ మీద
నందికొండ వాగుల్లోన, నల్లతుమ్మ నీడల్లో
భూత ప్రేత పిశాచ భేతల
మారే డం డం.ఝడం భం భం

నందికొండ వాగుల్లోన, నల్లతుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన, సందెపొద్దు సీకట్లో
నీడల్లే ఉన్నా, నీతో వస్తున్నా
నీ కభళం పడతా, నిను కట్టుకుపోతా
నీ భరతం పడతా, నిను పట్టుకుపోతా
ఆ ఆ ఆ ఆ
ఓ ఓ ఓ ఓ
డాకిని డక్కా ముక్కల చెక్క దంబో తినిపిస్తాన్
తాటకివనిపిస్తే తాటలు వలిచేస్తాన్
గుంటరి నక్క డొక్కలో చొక్కా అంభో అనిపిస్తాన్
నక్కలు తొక్కిస్తాన్, చుక్కలు తగ్గిస్తాన్
రక్కిస మట్ట తొక్కిస గుట్ట పంభే దులిపేస్తాన్
తీతువు పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్
రక్కిస మట్ట తోక్కిస గుట్ట పంబే దులిపేస్తాన్
తీతువు పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్
వస్తాయా ఫట్ ఫట్ ఫట్ ఫట్
వస్తాయా ఝట్ ఝట్ ఝట్ ఫట్
కోపాలా మసజస తతగా శార్ధూలా
నందికొండ వాగుల్లోన, నల్లతుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన, సందెపొద్దు సీకట్లో
నీడల్లే ఉన్నా న్న న్న న్న, నీతో వస్తున్నా
నీ కబళం పడతా, నిను కట్టుకుపోతా
నీ భరతం పడతా, నిను పట్టుకుపోతా
ఏ ఏ ఏ ఏ
ఏ ఏ ఏ ఏ
నందికొండ వాగుల్లోన, నల్లతుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన, సందె పొద్దు సీకట్లో



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link