Yamuina There

హొయ్ రేరీరే హొయ్యారె హొయ్
యమునా తీరే హొయ్యారె హొయ్
యమునా ఎందుకే నువ్వు ఇంత నలుపెక్కినావు
రేయి కిట్టయ్య తోటి కూడావా
యమునా ఎందుకే నువ్వు ఇంత నలుపెక్కినావు
రేయి కిట్టయ్య తోటి కూడావా
నల్ల నల్లని వాడు నిన్ను కవ్వించెనా
వలపు సయ్యాటలోన నలుపే నీకంటెనా
హొయ్ రేరీరే హొయ్యారె హొయ్
యమునా తీరే హొయ్యారె హొయ్

వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చు
కన్నట్టె గీకేసి పెడతాడే చిచ్చు
వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చు
కన్నట్టె గీకేసి పెడతాడే చిచ్చు
తల్లమ్మ బోతుంటే చెంగట్టుకుంటాడే
(తల్లమ్మ బోతుంటే చెంగట్టుకుంటాడే)
దారి బట్టి సుట్టూ తారాడుతాడే
పిల్ల పోనివ్వనంటూ సల్లాపాగేస్తడే
అల్లరల్లరి వాడు అబ్బో ఏం పిల్లడే
హొయ్ రేరీరే హొయ్యారె హొయ్
యమునా తీరే హొయ్యారె హొయ్

పికిపింఛ మౌళన్న పేరున్న వాడే
శృంగార రంగాన కడతేరినాడే
పికిపింఛ మౌళన్న పేరున్న వాడే
శృంగార రంగాన కడతేరినాడే
రేపల్లెలోకెల్ల రూపైన మొనగాడే
(రేపల్లెలోకెల్ల రూపైన మొనగాడే)
ఈ రాధకీడైన జతగాడు వాడే
మురళీ లోలుడు వాడే ముద్దు గోపాలుడే
వలపే దోచేసినాడే చిలిపి శ్రీకృష్ణుడు
హొయ్ రేరీరే హొయ్యారె హొయ్
యమునా తీరే హొయ్యారె హొయ్
యమునా ఎందుకే నువ్వు ఇంత నలుపెక్కినావు
రేయి కిట్టయ్య తోటి కూడావా
నల్ల నల్లని వాడు నిన్ను కవ్వించెనా
వలపు సయ్యాటలోన నలుపే నీకంటెనా
హొయ్ రేరీరే హొయ్యారె హొయ్
యమునా తీరే హొయ్యారె హొయ్



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link