Kanya Kumaari

కన్యాకుమారి కనపడదా దారి
కయ్యాలమారి పడతావే జారి
పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా
ఊగకే మరి మతి లేని సుందరి
(జింగి చక్ జింగి చక్ చా)
(చక్ జింగి చక్ జింగి చక్ చా)
గోపాలబాలా ఆపర ఈ గోల
ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాలా
మైకంలో మయ సభ చూడు
మహరాజా రాణా తోడు
సాగనీ మరి సరదాల గారడి

(జింగి చక్ జింగి చక్ చా)
(చక్ జింగి చక్ జింగి చక్ చా)

కొండలు, గుట్టలు చిందులాడే తదిగిణతోం
వాగులు, వంకలు ఆగి చూసే కథ చెబుదాం
తూనీగ రెక్కలెక్కుద్దాం, సూరీడి పక్క నక్కుద్దాం
ఊదేటి కొమ్ము వెతుకుదాం, బంగారు జింకనడుగుదాం
చూడమ్మా... హంగామా
అడివంతా అరంగేట్రం, సాగించే variety program
కళ్ళ విందుగా పైత్యాల పండగ

(జింగి చక్ జింగి చక్ చా)
(చక్ జింగి చక్ జింగి చక్ చా)

ఆ కన్యాకుమారి కనపడదా దారి
ఆహా కయ్యాలమారి పడతావే జారి
మైకంలో మయ సభ చూడు
మహరాజా రాణా తోడు
సాగనీ మరి సరదాల గారడి

(జింగి చక్ జింగి చక్ చా)
(చక్ జింగి చక్ జింగి చక్ చా)

డేగతో ఈగలే fight-u చేస్తే చెడుగుడులో
చేపలే చెట్టుపై పళ్లు కోసే గడబిడలో
నేలమ్మ తప్ప తాగెనో, ఏ మూల తప్పిపోయనో
మేఘాల కొంగు పట్టుకో, తూలేటి నడకనాపుకో
ఓయమ్మో... మాయమ్మో
దిక్కుల్నే ఆటాడించే కిక్కుల్లో గందరగోళం
ఒళ్లు ఊగగా... ఎక్కిళ్లు రేగగా

(జింగి చక్ జింగి చక్ చా)
(చక్ జింగి చక్ జింగి చక్ చా)

ఏయ్... గోపాలబాలా ఆపరా ఈ గోల
ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాలా
ఆ పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా
ఊగకే మరి మతి లేని సుందరి

(జింగి చక్ జింగి చక్ చా)
(చక్ జింగి చక్ జింగి చక్ చా)
సాగనీ మరి సరదాల గారడి
(జింగి చక్ జింగి చక్ చా)
(చక్ జింగి చక్ జింగి చక్ చా)



Credits
Lyrics powered by www.musixmatch.com

Link