Matanate

మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా అంటా
రుజువంటూ దొరికిందంటే
గంట కొట్టి చాటేస్తూవుంటా

నిజమంటే తంటాలంటా
నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
మొదలంటూ చెడతావంటా
వెంటబడి తెగ తంతారంట

గోపీ నా పక్కనుంటే, భయమింకా ఎందుకంటా
ఎవరంటే నాకేవంటా తప్పులుంటె ఒప్పనంటా

నీవెంటే నేనువుంటా చూస్తుంటా ఓరకంట
నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా

(ఝనక్క జుమ్మ)
మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా అంటా

మొదలంటూ చెడతావంటా
వెంటబడి తెగ తంతారంట

నువ్వే మా మొదటి guest అని
మా ఆవిడ వంట best అని
ఈ feastకి పిలుచుకొస్తిని taste చెప్పి పోరా

ఇదే మా విందు భోజనం
మీరే మా బంధువీ దినం
రుచుల్లో మంచి చెడ్డలు ఎంచి తెలుపుతారా

అపార్ధం చేసుకోరుగా
అనర్ధం చెయ్యబోరుగా
యదార్ధం చేదుగుంటది
పదార్ధం చెత్తగున్నది
ఇది విందా నా బొందా
తిన్నోళ్ళూ గోవిందా
జంకేది లేదింక నీ టెంక పీకెయ్యక, పదరకుంకా

నిజమంటే తంటాలంటా
నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
మొదలంటూ చెడతావంటా
వెంటబడి తెగ తంతారంట

గోపీ నా పక్కనుంటే, భయమింకా ఎందుకంటా
ఎవరంటే నాకేవంటా తప్పులుంటె ఒప్పనంటా

నిజమంటే తంటాలంటా
నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా

రుజువంటూ దొరికిందంటే
గంట కొట్టి చాటేస్తూవుంటా

భళారే నీలి చిత్రమా
భలేగా వుంది మిత్రమా
ఇలా రస యాత్ర సాగదా పక్కనుంటె భామా
కోరావు అసలు truth-uను
చూపాను సిసలు booth-uను
చిక్కారు తప్పు చేసి ఇక మక్కెలిరగదన్ను

తమాషా చూడబోతిరా
తఢాఖా చూపమందురా
మగాళ్ళని ఎగిరి పడితిరా
మదించి మొదలు చెడితిరా
సిగ్గైనా ఎగ్గైనా లేకుండా దొరికారా
Lock-up-u పైకప్పు మీ కిప్పుడే చూపుతా
Bend-u తీస్తా

మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా అంటా
రుజువంటూ దొరికిందంటే
గంట కొట్టి చాటేస్తూవుంటా

నీవెంటే నేనువుంటా చూస్తుంటా ఓరకంట
నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా

(ఝనక్క జుమ్మ)
మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా అంటా
మొదలంటూ చెడతావంటా
వెంటబడి తెగ తంతారంట



Credits
Writer(s): Vennelakanti, Sirivennela Sitarama Sastry, Ilaiya Raaja
Lyrics powered by www.musixmatch.com

Link