Uyyalaina Jampalaina

ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని
మళ్ళి మనలా పుట్టించాడు సీతారాములని
ఇదో రకం స్వయంవరం అనేట్టుగా ఇలా
నీ చూపులే నాపై పడే ఓ పూలమాలలా
హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల వెన్నెల్లొ ఊగాలిలా

ఓహో, నీవేగ నాలో నా గుండెలో శ్రుతి లయ
ఓహో, నీవేగ నాకు నా ఊహలో సఖీ ప్రియా

చెయ్యే చాస్తే అందేటంత దగ్గర్లొ ఉంది
చందమామ నీలా మారి నా పక్కనుంది
నీ కోసం నా కోసం ఇవ్వాళే ఇలా
గుమ్మంలోకొచ్చింది ఉగాదే కదా
ఒక్కో క్షణం పోతేపోని పోయేదెముంది
కాలాన్నిలా ఆపే బలం ఇద్దర్లొ ఉంది
రేపంటూ మాపంటూ లేనేలేని
లోకంలో ఇద్దరినే ఊహించనీ
ఎటువైపు చూస్తున్న నీ రూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలా
ఎదురైతె రాలేను ఎటువైపు పోలేను నీ పక్కకొచ్చేదెలా
ఒహో, నా జానకల్లే ఉండాలిగా నువ్వే ఇలా
ఒహో, వనవాసమైనా నీ జంటలో సుఖం కదా

ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని
మళ్ళి మనలా పుట్టించాడు సీతారాములని
నా పాదమే పదే పదే నీ వైపుకే పడే
జోలాలి పాట ఈడునే పడింది ఈ ముడే
ఒహో, ఎన్నాళ్ళగానొ నా కళ్ళలో కనే కల
ఒహో, ఈ ఇంద్రజాలం నీదేనయా మహాశయ

(గుండెకే చిల్లేపడేలా జింకలా నువ్వే గెంతాలా
ఇద్దరం చెరో సగం సగం సగం సగం
ఎందుకో ఏమో ఈ వేళా నేనే సొంతం అయ్యేలా
నువ్వు నా చెంతే చేరి చెయ్యి నిజం కొంజం)



Credits
Writer(s): Vasu Valaboju, Sunny Mr
Lyrics powered by www.musixmatch.com

Link