Bala Chilaka

బాల చిలక పరువాల సొగసు కనవేల
ఎందుకీ గోల తగువులింకేల
అధర మధురాల గ్రోల మురిపాల తేల రసకేళికే తగనా
ఏల నన్నేల ఏల నీ దయ రాదు
పరాకు చేసేవేళ సమయము కాదు
రారా రామయ్య రారా రారా శృంగార వీర
రారా నా జీవ గాత్రా సుమశర గోత్ర
చాల గడిచె నీ రేయి వలపు తరువాయి తలుపులే మూయి
దొరకదీ హాయి మనసు కనవోయి
మనకు తొలిరేయి కాంతపై
ఏల నన్నేల ఏల నీ దయ రాదు
పరాకు చేసేవేళ సమయము కాదు

వాహనాల మణిభూషణాల భవనాల నేను నిను కోరితినా
లేత వయసు తొలిపూత సొగసు నీ చెంతనుంచక దాచితినా
సగము సగము జతకాని తనువుతో తనివి తీరక మనగలనా
కడలి తరగలా సుడులు తిరిగి కడకొంగు తెరలలో పొంగి పొరలి
ఈ వరద గోదారి వయసుకే దారి
పెళ్ళాడుకున్న ఓ బ్రహ్మచారి
ఏల నీ దయ రాదు
పరాకు చేసేవేళ సమయము కాదు



Credits
Writer(s): Veturi, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link