O Naa Cheliya

ఓఓ నా చెలియా నీ జాడ తెలుపవేమే
ఓ ఓ నా సఖియా నీ జాడ తెలుపవేమే
ఎక్కడ ఎక్కడ ఎక్కడని వెతకాలి నా చెలిని
చిక్కని జాడల చిక్కుముడి నువు విప్పవేమే చిరుగాలి
ఎక్కడ ఎక్కడ ఎక్కడని వెతకాలి నా చెలిని
చిక్కని జాడల చిక్కుముడి నువు విప్పవేమే చిరు గాలి
ఊపిరయ్యినావే నువు కనబడక
ఊయలూగినావే నువు చెలి వెనక
ఊపిరయ్యినావే నువు కనబడక
ఊయలూగినావే నువు చెలి వెనక
ఎంతగా ఇటు చూసినా, ఇంతగా బతిమాలినా
చెప్పవేమే చిరునామా
అప్పుడు ఇప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కడ వెతకాలి
ఓఓ నా చెలియా నీ జాడ తెలుపవేమే
ఓ ఓ నా సఖియా నీ జాడ తెలుపవేమే

నేలంతా సందడి చేసే ఆ అల్లరి సంగతి తెలుసే
పచ్చనైన రెల్లు మీద పారేటి గట్ల మీద
చెలి నడిచిన దారి కదా
తన నడకల నాట్యం చూస్తూ, సిరిమువ్వల సవ్వడి వింటూ
ఘల్లుఘల్లు గంతులేసి ఝల్లు ఝల్లు పరుగు తీసి
ఉప్పొంగి పోలేదా
చిటపటతో చిందేసే అందాల బొమ్మ
జత కలిసి మది మురిసి తడిపేసే చినుకమ్మ
మెరుపల్లె తను మెరిసింది, మెల్లంగా ఎద గిల్లింది
ఉక్కిరి బిక్కిరి ఊహలలో మది ఊగిసలాడింది
ఓఓ నా చెలియా నీ జాడ తెలుపవేమే
ఓ ఓ నా సఖియా నీ జాడ తెలుపవేమే

హరివిల్లుల రెప్పలు తెరిచి చూపుల కిరణాలే విసిరి
తూరుపింట వేకువయ్యి వాకిలంతా ముగ్గులేసి
కనలేదా ఆ నింగి
చలి వేళల చక్కిలి నిమిరి
నును వెచ్చని సిగ్గులు అమరి
జాబిలమ్మ జాజులయ్యే జావళీల జోల పాడే
భోగి మంట నీ నేస్తం
చిగురాకు రాగాల్లో ఊగింది పల్లవై
ఈ వనమే యవ్వనమై పొంగింది వెల్లువై
ఆరా తీసే ఆరాటాలే, నిదుర దోచే జాగారాలే
కుదురుగా నిమిషం నిలువని పాదం పరుగులు తీసింది
ఓఓ నా చెలియా నీ జాడ తెలుపవేమే
ఓ ఓ నా సఖియా నీ జాడ తెలుపవేమే



Credits
Writer(s): Kasarla Shyam, Alle Madhubabu
Lyrics powered by www.musixmatch.com

Link