Chinukula Raali

చినుకలా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను
మరిచిపోబోకుమా హా మమత నీవే సుమా
చినుకలా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ

ఆకులురాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే నేవేచి ఉంటానులే
జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే
ఆ చల్ల నీతోడులే...

హిమములా రాలి సుమములై పూసి
ఋతువులై నవ్వి మధువులై పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా శిథిలమైనా
విడిచిపోబోకుమా విరహమైపోకుమా

తొలకరి కోపం తొదిమను నేనై అల్లాడుతున్నానులే
పులకరమూగే పువ్వులకోసం వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దురావాలిలే
నిన్నలు నేడై రేపటి నేదై నా ముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే...

మౌనమై మెరిసె గానమై పిలిచి
కలలతో అలసి గగనమై ఎగసె
నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైనా గగనమైనా
ప్రేమ మయమే సుమా హా ప్రేమ మనమే సుమా

చినుకలా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
ఆహాహా ఆహాహా ఆహాహా... ఆహాహా.



Credits
Writer(s): Veturi, Raghu Kunche
Lyrics powered by www.musixmatch.com

Link