Mandantha Pothuntey

మందేంట పోతండే ఎలమంద, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద
చుస్తే సిన్నపోరగాడే ఎలమంద, వన్నె రుమాలే కట్టిండు ఎలమంద

(మందేంట పోతండే ఎలమంద, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద
చుస్తే సిన్నపోరగాడే ఎలమంద, వన్నె రుమాలే కట్టిండు ఎలమంద
మందేంట పోతండే ఎలమంద, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద)

అంగిలేనివోట్టి పై గొంగలేసుకుండు
అడ్డపంచెను బుడ్డ గోసిగ కట్టిండు
కిర్రు తోలు జోళ్ళు కాళ్ళకు తోడిగిండు

(కిర్రు తోలు జోళ్ళు కాళ్ళకు తోడిగిండు
కిర్రు తోలు జోళ్ళు కాళ్ళకు తోడిగిండు)

కందిజొన్న కోయ ఎలమంద, కౌంజు పిట్టవలె పోతుండు ఎలమంద
వేలెడంత లేదు ఎలమంద, వేయి మందకే వస్తాదు ఎలమంద

(మందేంట పోతండే ఎలమంద, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద
చుస్తే సిన్నపోరగాడే ఎలమంద, వన్నె రుమాలే కట్టిండు ఎలమంద
మందేంట పోతండే ఎలమంద, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద)

ఎక్కరాని తుమ్మలెక్కి నరుకుతాడు
ఎత్తైన గుట్టలెల్ల తిరుగుతాడు
వాగుల వంకల రాగాలు తీస్తాడు

(వాగుల వంకల రాగాలు తీస్తాడు
వాగుల వంకల రాగాలు తీస్తాడు)

చెరువు గట్టున నిలిచి ఎలమంద
చందమామోలె నవుతాడు ఎలమంద
తుమ్మనీడ ఉంటె ఎలమంద
అమ్మావొడిని మరుసుతాడే ఎలమంద

(మందేంట పోతండే ఎలమంద, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద
చుస్తే సిన్నపోరగాడే ఎలమంద, వన్నె రుమాలే కట్టిండు ఎలమంద
మందేంట పోతండే ఎలమంద, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద)

మూతికి జానెడు మోదుగ సుట్టను
సేతి సద్దున పెట్టి గుప్పున గుంజేటి
తండ్రిసెప్పిన మాట గీత దాటిపోడు

(తండ్రిసెప్పిన మాట గీత దాటిపోడు
తండ్రిసెప్పిన మాట గీత దాటిపోడు)

పిర్ర గిల్లంగనే ఎలమంద
వాడు టిర్రుమంటడమ్మ ఎలమంద
వీడు కూత పెట్టంగనే ఎలమంద
వేట తోడేళ్ళు పరారు ఎలమంద

(మందేంట పోతండే ఎలమంద, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద
చుస్తే సిన్నపోరగాడే ఎలమంద, వన్నె రుమాలే కట్టిండు ఎలమంద
మందేంట పోతండే ఎలమంద, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద)

తుంపరొచ్చి గొర్రె తుమ్మిన దగ్గిన
ముల్లుకొట్టి గొర్రె కాలిడ్చిన గాని
తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు

(తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు
తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు)

కొట్టకులోట్టకు ఎలమంద
చెట్టు నూరి కట్టుతాడే ఎలమంద
యాడ నేర్చిన విద్య ఎలమంద
గొల్ల కురమవాడ విద్య ఎలమంద

(మందేంట పోతండే ఎలమంద, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద
చుస్తే సిన్నపోరగాడే ఎలమంద, వన్నె రుమాలే కట్టిండు ఎలమంద
మందేంట పోతండే ఎలమంద, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద)

యడాదికోసారి గోర్లేల్లి పోతుంటే
తోడుగున్న గొర్లు యాడికిపొతున్నయని
తల్లినడుగుతాడు తండ్రినడుగుతాడు

(తల్లినడుగుతాడు తండ్రినడుగుతాడు
తల్లినడుగుతాడు తండ్రినడుగుతాడు)

గొర్ల కటికివనికమ్మ ఎలమంద
కండ్ల నీళ్ళు పెడతాడమ్మ ఎలమంద
గొర్లు తరలిపోతువుంటే ఎలమంద
వాడు గోల్లుమంటడమ్మ ఎలమంద
వాడు గోల్లుమంటడమ్మ ఎలమంద
వాడు గోల్లుమంటడమ్మఎలమంద
వాడు గోల్లుమంటడమ్మ ఎలమంద
వాడు గోల్లుమంటడమ్మ ఎలమంద
వాడు గోల్లుమంటడమ్మ ఎలమంద

Credits
Writer(s): Vandemataram Srinivas, Goranti Venkanna
Lyrics powered by www.musixmatch.com

Link