Rakshasa Rajyam

రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలి యుద్ధం
కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం
ఇదినావేదం గుండెల శపదం
గగన విహారం రణరంగం
కొలిమిలో కత్తికి పెట్టిన కత్తులు కావా ఎప్పూడు పరిహారం
దహధన కత్తులకు ఊపిరిపోసిన గూటం దెబ్బది ఈ ఘాతం
గన గన మండే నిప్పుల కొలిమిలో కాలే కత్తుల కోలాటం

పల్లె మాతల్లి మాకు బువ్వని పెట్టింది
జాబిల్లి సిరిమల్లి సుఖసంపదలిస్తుంది
కలిగంజి తాగైనా మేం చల్లగ ఉంటుంటే
దాస్టీకం దౌర్జన్యం మామెతుకులు దోస్తుంటే
మన ఉణికిని చిత్రం చేసినోడి మూలాలను చేదించి
జనజాతి రక్షణకు కత్తిపట్టిన పోతురాజులం మేమేలే

రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలి యుద్ధం
కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం

ధూళికి జూకు దమరుకు మళ్ళి భేరిలైలేద్దాం
సెల్లం గొడ్డలి భల్లెం మాకు ఆయుధాలమవుతాం
కత్తులు కాళ్ళై సమరంలో కవాతు చేస్తాయి (చేసేయ్)
సుత్తులు వేళ్ళై యుద్దంలో బాకులు దూస్తాయ్ (రైరై)
బతకాలంటే చావడానికే సిద్ధంగున్నోళ్ళం
మా బతకే హక్కును కాలరాస్తే అంతుతేల్చుకోవడం

రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలి యుద్ధం
కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం

Credits
Writer(s): Ramana Gogula, Masterji
Lyrics powered by www.musixmatch.com

Link