Bommanu Geesthey

బొమ్మనుగీస్తే నీలా ఉంది
దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెళితే
దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది

సరసాలాడే వయసొచ్చింది
సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలనే నాకూ ఉంది
కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే ఉందంది

చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది
వెచ్చని కౌగిలిగా నిను అల్లుకుపోమ్మంది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ
శ్రమపడిపోకండి తమ సాయం వద్దండి
పొమ్మంటావే బాలికా ఉంటానంటే తోడుగా
అబ్బో యెంత జాలిరా తమరికి నా మీద
ఏం చెయ్యాలమ్మ నీలో ఏదో దాగుంది
నీవైపే నన్నే లాగింది

అందంగా ఉంది తన వెంటే పది మంది
పడకుండా చూడు అని నా మనసోంటుంది
తమకే తెలియంది నా తోడై ఒకటుంది
మరెవరో కాదండి అది నా నీడేనండి
నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి
హయ్యో అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాటకోసం ఎన్నాళ్ళుగా వేచుంది
నా మనసు ఎన్నో కలలే కంటుంది

బొమ్మను గీస్తే నీలా ఉంది
దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెళితే
దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది



Credits
Writer(s): Devi Sri Prasad, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link