Niluvaddham - From "Nuvvostanante Nenoddantana"

నిలువద్దము నిను ఎపుడైనా
నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువు విన్నది నీ పేరైనా
నిను కాదని అనిపించేనా
ఆ సంగతే కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం
నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే
తీయదనం నా పేరేనా
అది నువ్వే అని నువ్వే
చెబుతూ ఉన్నా

లలలైలలైలైలే
లలలైలలైలైలే
లలలైలలైలైలే లైలే లైలే లైలైలే

నిలువద్దము నిను ఎపుడైనా
నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా

ప్రతి అడుగు తనకు తానే
సాగింది నీవైపు
నా మాట విన్నంటు నేనాపలేనంతగా
భయపడకు అది నిజమే
వస్తోంది ఈ మార్పు
నీ కోతి చిందుల్ని
నాట్యాలుగా మార్చగా
నన్నింతగా మర్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు
నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు

లలలైలలైలైలే
లలలైలలైలైలే
లలలైలలైలైలే లైలే లైలే లైలైలే

నిలువద్దము నిను ఎపుడైనా
నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా

ఇది వరకు ఎద లయకు
ఏమాత్రమూ లేదు హోరెత్తు
ఈ జోరు కంగారు పెట్టేంతగా
తడబడకు నను అడుగు
చెబుతాను పాఠాలు
లేలేత పాదాలు జలపాతమయ్యేట్టుగా
నా దారినే మళ్లించగా
నీకెందుకు అంత పంతం
మనచేతిలో ఉంటే కదా
ప్రేమించడం మానటం

లలలైలలైలైలే
లలలైలలైలైలే
లలలైలలైలైలే లైలే లైలే లైలైలే

నిలువద్దము నిను ఎపుడైనా
నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువు విన్నది నీ పేరైనా
నిను కాదని అనిపించేనా
ఆ సంగతే కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం
నాదేనా అనుకుంటున్నా
నా పేరుకి ఆ తీయదనం
నీ పెదవే అందించేనా
అది నువ్వే అని నువ్వే
చెబుతూ ఉన్నా

లలలైలలైలైలే
లలలైలలైలైలే
లలలైలలైలైలే లైలే లైలే లైలైలే



Credits
Writer(s): Devi Sri Prasad, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link