Netho Cheppana

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా
గారం చేసినా నయగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా

నేనే నేనుగా లేనే లేనుగా
నా కన్నుల నీదే వెన్నెల

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా

ఇంకొంచం అనుకున్నా, ఇక చాల్లే అన్నానా
వదలమంటే ఏమిటర్థం వదిలి పొమ్మనా
పనిమాల పైపైన పడతావేం పసికూన
ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా

మగువ మనసు తెలిసేనా మగజాతికి
మోగలి మోనలు తగిలేనా లేత సోయగానికి కూత దేనికి

గారం చేసినా నయగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా

ఒదిగున్న ఒరలోన కదిలించకే కుర్రదానా
కత్తిసాముతో ప్రమాదం పట్టుజారినా
పెదవోపని పదునైనా పరవాలేదనుకోనా
కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా

సొంత సొగసు బరువేనా సుకుమారికి
అంత బిరుసు పరువేనా రాకుమారుడంటి నీ రాజసానికి

గారం చేసినా నయగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా

నేనే నేనుగా లేనే లేనుగా
నా కన్నుల నీదే వెన్నెల



Credits
Writer(s): Mani Sarma, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link