Jabiliki

జాబిలికి వెన్నెలలిస్తా
మబ్బులకి మెరుపులనిస్తా
పూవులకి పరిమళమిస్తా
వాగులకి వరదలనిస్తా
గాజులకి చేతులనిస్తా
గజ్జెలకి పాదాలిస్తా
కాటుకకి కన్నులనిస్తా
పాటలకి మౌనాలిస్తా
ఊరూ పేరు తెలియని
వాటికి ఏవేవో ఇచ్చి
నీకు నా మనసిస్తా
మనసులో చోటిస్తా
నీకు నా ముద్దిస్తా
ప్రేమనే ముద్రిస్తా
నీకు నా మనసిస్తా
మనసులో చోటిస్తా
నీకు నా ముద్దిస్తా
ప్రేమనే ముద్రిస్తా

జాబిలికి వెన్నెలలిస్తా
మబ్బులకి మెరుపులనిస్తా
పూవులకి పరిమళమిస్తా
వాగులకి వరదలనిస్తా

కొత్త సిగ్గు నీకివ్వను
నీ అల్లరికిస్తాను
కౌగిలింత నీకివ్వను
నీ పొగరుకి ఇస్తాను
కొంటె కబురు నీకివ్వను
నీ ఊపిరికిస్తాను
పంటి పదును నీకివ్వను
నీ పెదవికి ఇస్తాను
ఇన్నినాళ్లు దాచుకున్న కన్నెతనం నీకివ్వను
ఇన్నినాళ్లు దాచుకున్న కన్నెతనం నీకివ్వను
కొన్నినాళ్లు వేచి ఉన్న
నీ కుర్రతనానికి ఇస్తా
నీకు నా చెలిమిస్తా
చెలిమిలో చనువిస్తా
కొద్దిగా అలుసిస్తా పూర్తిగా విలువిస్తా

వలపు ఎరుపు నీకివ్వను
నీ పాపిటకిస్తాను
చిలిపి ముడుపు నీకివ్వను
నీ చీకటికిస్తాను
ఎదను ఒలిచి నీకివ్వను
నీ దోసిలికిస్తాను
ఎదురు చూపు నీకివ్వను
నీ వాకిలికిస్తాను
మండపాన కోరుకున్న మూడుముళ్లు నీకివ్వను
మండపాన కోరుకున్న మూడుముళ్లు నీకివ్వను
గుండెలోన చేరుకున్న
నీ ఏడు జన్మలకు ఇస్తా
నీకు నా మనవిస్తా
మనువుతో తనువిస్తా
తనువుతో చనువిస్తా తనివినే తీరుస్తా

నీకు నా మనసిస్తా
మనసులో చోటిస్తా
నీకు నా ముద్దిస్తా
ప్రేమనే ముద్రిస్తా
నీకు నా చెలిమిస్తా
చెలిమిలో చనువిస్తా
కొద్దిగా అలుసిస్తా పూర్తిగా విలువిస్తా



Credits
Writer(s): Mani Sarma, K S Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link