Sivanamame Naku

శివ నామమే నాకు పారాయణం
నిజ అరుణాచలేశ్వరము నా హృదయము
ఓ అచలేశ్వర హే శివ శంకర
ఓ అచలేశ్వర హే శివ శంకర
నా స్మరణే నీకు అభిషేకము
నా స్మరణే నీకు అభిషేకము
శివ నామమే నాకు పారాయణం
నిజ అరుణాచలేశ్వరము నా హృదయము

నీదు నిజ సన్నిధి నాకు అది పెన్నిధి
స్వామి నీ సన్నిధానం అదియే గతి
నీ పదసేవ కల్గించు ఇలసక్కటి
దివ్య అరుణాచలం నాకు శరణాగతి
స్వామి నీ ఆలయం నాకు ఆరాధ్యము
తిరు అన్నమలాపురము నా ప్రాణము
గిరి నాథ నీ సేవ కైవల్యము
అరుణ గిరి నాథ నీ సేవ కైవల్యము
శివ నామమే నాకు పారాయణం
నిజ అరుణాచలేశ్వరము నా హృదయము

స్వామి హర శంకర నన్ను మన్నించరా
దేవ కరుణాకరా నీదు గతినియ్యరా
నీదు పదసీమ చేరేటి వరమియ్యరా
నీదు నిజ నామ గానాల మననియ్యరా
అరుణగిరి ధామమే చేరి నిలిచేనురా
భక్తి భావాలతో పూజ చేసేనురా
నీదు అభిషేకమే చెయ్యు తలచేనురా
అరుణ గిరి క్షేత్ర ప్రదక్షిణ చేసెనురా
శివ నామమే నాకు పారాయణం
నిజ అరుణాచలేశ్వరము నా హృదయము
ఓ అచలేశ్వర హే శివ శంకర
ఓ అచలేశ్వర హే శివ శంకర
నా స్మరణే నీకు అభిషేకము
నా స్మరణే నీకు అభిషేకము
శివ నామమే నాకు పారాయణం
నిజ అరుణాచలేశ్వరము నా హృదయము



Credits
Writer(s): R.p.karan, Ponduri
Lyrics powered by www.musixmatch.com

Link