Yavirikki Thelusa - Original

వలపుకొయలలు పాడె వసంతం నీ స్వంతం
మల్లెల మంటల రేగిన గ్రీష్మం నా గీతం
పున్నమి పువ్వై నవ్విన వెన్నెల నీ ఆనందం
ఆ వెన్నెల తో చితి రగిలించిన కన్నులు నా సంగీతం
ఆపేసావెం బాబు బాగుంది ఆలపించు

ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ
ఎవరికి తెలుసూ
ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ
ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసూ

మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువనీ
మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువనీ
చీకటి మూగిన వాకిట తోడుగ నీడై నా దరి నిలువదనీ
జగతికి హృదయం లేదని
ఈ జగతికి హృదయం లేదని
నా జన్మకు ఉదయం లేనే లేదనీ


ఎవరికి తెలుసూ
ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ
ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసూ

గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినదీ జీవితం
గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినదీ జీవితం
నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం
నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం
ప్రేమకు మరణం లేదని
నా ప్రేమకు మరణం లేదని
నా తోటకు మల్లిక లేనే లేదనీ


ఎవరికి తెలుసూ
ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ
ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసూ
మ్మ్మ్మ్ మ్

సాహిత్యం: వేటూరి



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, M. S. Viswanathan
Lyrics powered by www.musixmatch.com

Link