Hey Pandu Ranga - From "Sri Shirdi Sai Baba Mahathyam"

హే! పాండురంగా! హే! పండరి నాథా!
శరణం శరణం శరణం
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం

విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై
పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై
తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై
మహల్సా శ్యామాకు మారుతి గాను, మరి కొందరికి దత్తాత్రేయుడుగా
యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల జేసాడు
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం

పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను, ఆదరించె తాననాథ నాథుడై
అజ్ఞానం అలముకొన్న అంధులను చేరదీసి, అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై
వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను, పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై
పుచ్చుకున్న పాపమునకు ప్రక్షాళన చేసుకొనెను, దౌత్య క్రియ సిద్ధితో శుద్ధుడై
అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో, ఆత్మ శక్తి చాటినాడు సిద్ధుడై
జీవరాశులన్నిటికి సాయే శరణం (సాయే శరణం)
విద్య దాన సాధనకు సాయే శరణం (సాయే శరణం)
ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం
(ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం)
భక్తికీ సాయే శరణం, ముక్తికీ సాయే శరణం
(భక్తికీ సాయే శరణం, ముక్తికీ సాయే శరణం)
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే



Credits
Writer(s): Acharya Athreya, Ilaiyaraaja
Lyrics powered by www.musixmatch.com

Link