Kaalame Thanu

కాలమే తాను ఈల వేసింది కలుసుకోవాలని
నిన్ను నాలోన, నన్ను నీలోన నిలుపుకోవాలని
ఇంతలోనే ఏమాయేనో
వింత అనుభూతి మొదలాయెను

ఆశలో శ్వాసలో అన్నిటా నీవే
ఈ నీలలో ఆ నింగిలో నీ జాడనే
వెన్నెలే అంతటా వెల్లువై ఎగసెలే
ఏ రాగమో అనురాగమై విరిసిందిలే
కాలమే తాను ఈల వేసింది కలుసుకోవాలని
నిన్ను నాలోన, నన్ను నీలోన నిలుపుకోవాలని
ఇంతలోనే ఏమాయేనో
వింత అనుభూతి మొదలాయెను

నీ వాలు కళ్ళలో నా వలపు జల్లులే
ప్రతి నిమిషమూ సన సన్నగా కురిసేనులే
నీ వెంట నేనుగా, నా జంట నీవుగా
ప్రతి జన్మలో జత వీడక సాగేనులే
కాలమే తాను ఈల వేసింది కలుసుకోవాలని
నిన్ను నాలోన, నన్ను నీలోన నిలుపుకోవాలని
ఇంతలోనే ఏమాయేనో
వింత అనుభూతి మొదలాయెను



Credits
Writer(s): C. Narayan Reddy, Vishwajith Dharma Teja
Lyrics powered by www.musixmatch.com

Link