Giliga Gili

గిలిగా గిలిగిలిగా గిలిగింతగా
కసిగా కసికసిగా కవ్వింతగా
ఒళ్లంత తుళ్లింతలై
వాటేసుకున్నంతలై
జపించి నీ పేరే నే తపించిపోతున్నా
తెలుసా హే పురుషోత్తమా

గిలిగా గిలిగిలిగా గిలిగింతగా
కసిగా కసికసిగా కవ్వింతగా

వయసే నడినెత్తికెక్కింది ఈ పూట
పైటే చలిపుట్టి జారిందయ్యో
వలపే కుడికన్ను కొట్టింది రమ్మంటా
పెదవే తడిచేసుకుందామమ్మో
ఒదిగీ ఒకటైతే ఒకటే గొడవైతే
ఇంకా ప్రేమకథా ముదిరేనయ్యా
పసుపు చెక్కిళ్లో ఎరుపు దుమారం
చిలిపి చూపులకే వణికే వయ్యారం
పగలే కోరికలు పడుచు అల్లికలు
ముదిరి ముదిరి మనువు కుదిరి
మనసు మనసు కలిసిన సిరిలో

గిలిగా గిలిగిలిగా గిలిగింతగా
కసిగా కసికసిగా కవ్వింతగా

ఎండా వానల్లో నీళ్లాడే అందాలు
ఎదలో చప్పట్లే వేసేనమ్మా
మసక చీకట్లో చిగురేసే పరువాలు
మతినే పోగొడితే ఎట్టాగయ్యో
నిదరే కరువైతే కలలే బరువైతే
వయసు గుప్పిళ్లే తెరవాలమ్మో
సొగసు తోటల్లో పడుచు వయారం
వడిసి పట్టగనే ఎంత సుతారం
అడిగే కానుకలు కరిగే కాటుకలు
చిలిపి చిలిపి వలపు లిపిని
కలికి చిలుక గిలికిన సడిలో

గిలిగా గిలిగిలిగా గిలిగింతగా
కసిగా కసికసిగా కవ్వింతగా
ఒళ్లంత తుళ్లింతలై
వాటేసుకున్నంతలై
జపించి నీ పేరే నే తపించిపోతున్నా
తెలుసా హే పురుషోత్తమా

గిలిగా గిలిగిలిగా గిలిగింతగా
కసిగా కసికసిగా కవ్వింతగా



Credits
Writer(s): Veturi Murthy, Ilayaraja I
Lyrics powered by www.musixmatch.com

Link