Kita Kita Talupulu

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం.
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం.
రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా.
ప్రేమ.ప్రేమ. ప్రేమా.ప్రేమ.
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం.
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం.

(ACVL)

నిన్నిలా చేరే దాక ఎన్నడూ నిదురే రాక.
కమ్మని కలలో అయినా నిను చూడలేదే.
నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంకా.
రెప్పపాటైనా లేక చూడాలనుందే.
నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా.
కాసేపిలా కవ్వించవా నీ మధుర స్వప్నమై ఇలా.
ప్రేమ.ప్రేమ. ప్రేమా.ప్రేమ.
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం.
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం.

(ACVL)

కంట తడి నాడూ నేడూ చెంప తడిమిందే చూడు.
చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా.
చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి.
అమృతం అయిపోలేదా ఆవేదనంతా.
ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా.
ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా.
ప్రేమ.ప్రేమ. ప్రేమా.ప్రేమ.
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం.
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం.
రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా.
ప్రేమ.ప్రేమ. ప్రేమా.ప్రేమ.
ప్రేమ.ప్రేమ. ప్రేమా.ప్రేమ.
ప్రేమ.ప్రేమ. ప్రేమా.ప్రేమ.

Credits
Writer(s): Sastry Seetharama, Pattnaik Prasad
Lyrics powered by www.musixmatch.com

Link