Manohara (Part 2)

మనోహర నా హృదయమునే
ఓ మధువనిగా మలిచినానంటా
రతీవర ఆ తేనెలనే
ఓ తుమ్మెదవై తాగిపొమ్మంటా

మనోహర నా హృదయమునే
ఓ మధువనిగా మలిచినానంటా
రతీవర ఆ తేనెలనే
ఓ తుమ్మెదవై తాగిపొమ్మంటా
నా యవ్వనమే నీ పరమై
పులకించే వేళ
నా ఎదలో ఒక సుఖమే
ఊగెనుగా ఉయ్యాల

జడివానై ప్రియా నన్నే చేరుకోమ్మా
శృతి మించుతోంది దాహం
ఒక పాన్పుపై పవళిద్దాం
కసి కసి పందాలెన్నో
ఎన్నో కాసి
నను జయించుకుంటే నేస్తం
నా సర్వస్వం అర్పిస్తా
ఎన్నటికి మాయదుగా
చిగురాకు తొడిగే ఈ బంధం
ప్రతి ఉదయం నిను చూసి
చెలరేగిపోవాలీ దేహం

మనోహర నా హృదయమునే
ఓ మధువనిగా మలిచినానంటా
సుధాకర ఆ తేనెలనే
ఓ తుమ్మెదవై తాగిపొమ్మంటా

ఓ ప్రేమా ప్రేమా

సందె వేళ స్నానం చేసి
నన్ను చేరి
నా చీర కొంగుతో
ఒళ్లు నువ్వు తుడుస్తావే
అదో కావ్యం
దొంగమల్లే ప్రియా ప్రియా
సడే లేక
వెనకాలనుండి నన్ను హత్తుకుంటావే
అదో కావ్యం
నీకోసం మదిలోనే
గుడి కట్టినానని తెలియనిదా
ఓసారి ప్రియమారా ఒడిచేర్చుకోవా
నీ చెలిని

మనోహర నా హృదయమునే
ఓ మధువనిగా మలిచినానంటా
రతీవర ఆ తేనెలనే
ఓ తుమ్మెదవై తాగిపొమ్మంటా
నా యవ్వనమే నీ పరమై
పులకించే వేళ
నా ఎదలో ఒక సుఖమే
ఊగెనుగా ఉయ్యాల



Credits
Writer(s): Bhuvana Chandra, Harris Jayaraj
Lyrics powered by www.musixmatch.com

Link