Edarilo Koyila

ఆఆ.ఆఅ... మ్.మ్...
ఎడారిలో కోయిలా.
తెల్లారనీ రేయిలా...
పూదారులన్నీ గోదారి కాగా
పూదారులన్నీ గోదారి కాగా
పాడింది కన్నీటిపాట

ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా

పల్లవించు ప్రతిపాట బ్రతుకు వంటిదే
రాగమొకటి లేక తెగిన వీణ వంటిదే.

ఎద వీణపై అనురాగమై
తలవాల్చి నిదురించు నా దేవత
కల అయితే శిల అయితే మిగిలింది
ఈ గుండె కోత
నా కోసమే విరబూసిన
మనసున్న మనసైన మరుమల్లిక
ఆమనులే వేసవులై
రగిలింది ఈ రాలు పూత
రగిలింది ఈ రాలు పూత
విధిరాత చేత నా స్వర్ణ సీత

ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా

కొన్ని పాటలింతే గుండెకోతలోనే చిగురిస్తాయి
కొన్ని బ్రతుకులంతే వెన్నెలతో చితి రగిలిస్తాయి

ఆ రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్లు నూరేళ్లుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాప
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిట
బ్రతుకంటే మృతి కంటే
చేదైన ఒక తీపి పాట
చేదైన ఒక తీపి పాట
చెలిలేని పాట... ఒక చేదు పాట

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా
పూదారులన్నీ గోదారి కాగా
పాడింది కన్నీటిపాట

ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా



Credits
Writer(s): Vandematharam Srinivas, Sivaganesh
Lyrics powered by www.musixmatch.com

Link