Sogasu Chooda Tarama

సొగసు చూడ తరమా
సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా
మరుని నారి నారి గ మారి మదిని నాటు విరిశరమా
సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా
మరుని నారి నారి గ మారి మదిని నాటు విరిశరమా
సొగసు చూడ తరమా

హేహె హేహేహె
కులుకే సుప్రభాతాలై కునుకే స్వప్న గీతాలై
ఉషా కిరణమూ నిషా తరుణమూ
కలిసె కలికి మేనిగా రతి కాంతుని కొలువుగా
వెలసే చెలి చిన్నెలలో
సొగసు చూడ తరమా

పలుకా చైత్ర రాగాలే అలకా గ్రీష్మ తాపాలె
మదే కరిగితే అదే మధుఝరీ
చురుకు వరద గౌతమీ చెలిమి శరత్ పౌర్ణమీ
అతివే అన్ని ఋతువు లయ్యే
సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా
మరుని నారి నారి గ మారి మదిని నాటు విరిశరమా
సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా
మరుని నారి నారి గ మారి మదిని నాటు విరిశరమా
సొగసు చూడ తరమా

సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

Credits
Writer(s): Ramani Bharadwaj, Chembolu Seetharama Sastry, Prasad
Lyrics powered by www.musixmatch.com

Link