Neelakasam

నీలాకాశం నా కావ్యం
తాకే రాసే ప్రేమాక్షరం
జాబిలి తునకో వెన్నెల వానో ఏమా అందం
ఆమని మదిలో మల్లెల వరదేనేమో రూపం
విరబూసిన పున్నమి పూతలలో...
చలిగాసిన పుష్యమి రాతిరిలా...
తామర కొలనుల తుమ్మెదలాడే ఏమా అందం
కలువల కళ్ళకు వన్నెలలూదే వేణూ గానం
తెలుగందాలే వోణీ చుడితే అన్నమయ్య పాట
కూడా వచ్చే కులుకేనేమో కూచిపూడి ఆట
తేనెలూరు మాటా అచ్చ తెలుగు తేట
కూకూ కూకూ ఈ రాగం కొమ్మా రెమ్మా కూడే క్షణం
త్యాగయ పదమో క్షేత్రయ పాటొ ఏమా అందం
పూర్ణమ్మ సొగసొ నండూరెంకో ఏమో రూపం
ఇరు చూపుల చుమబన సంబరమో...
ఎద గూటికి సాదర స్వాగతమో...
త్యాగయ పదమో క్షేత్రయ పాటొ ఏమా అందం
పూర్ణమ్మ సొగసొ నండూరెంకో ఏమో రూపం
కాష్మీరాలే పూచే పూలే మేని ఛాయ కాదే
కన్యా తీరం పొంగే అలలే కాళ్ళు కడిగి పోని
బాల నీల వేణీ క్రిష్ణవేణి కాని
నింగి నేలా జత చేసే సౌందర్యాలే సంయోగమా
భారత వనిత, భగవద్గీత ఆమే నేమో
గంగ యమున సంగమ స్ధలిలా ప్రేమేనేమో
నా జాతికి సుందర కేతనమో
ఈ ఖ్యాతికి చందన తోరణమో
భారత వనిత, భగవద్గీత ఆమే నేమో
గంగ యమున సంగమ స్ధలిలా ప్రేమేనేమో
-మను



Credits
Writer(s): Peddada Murthy, Lalit Suresh
Lyrics powered by www.musixmatch.com

Link