Kalalona

కలలోన నువ్వే
ఇలలోన నువ్వే

కలలోన నువ్వే ఇలలోన నువ్వే
కన్నీటి వరదై కమ్మేసినావే

గుండెలోన కూసిన కోయిల
గొంతుమూగదైనది ఏంటిలా
హృదయపు లయలకు కిలకిల
మరి నేర్పిన చెలిమే లేదెలా

నీలి నీలి కన్నుల నిండిపోవే ఇలా
జాలువారే వెన్నెల్లా ఉండిపోవే అలా

కలలోన నువ్వే ఇలలోన నువ్వే
కన్నీటి వరదై కమ్మేసినావే

ఆపవే ఆపవే అల్లరింక
ఈ అల్లిబిల్లి ఆగడాలు ఏల
చేరవే చేరవే చంద్రవంక
చిమ్మచీకటేగా చిన్నినవ్వు లేక
నువ్వు వాగల్లే వస్తే
చెలి మెరుపుల అలనే నేనౌతా
చిరుగాలై వీస్తే
నే ఎదురుగ నిలబడి అల్లుకుంటా
ఓ... పాపను నేనంటా
ఓ... అమ్మవు నీవంటా

నీలి నీలి కన్నుల నిండిపోవే ఇలా
జాలువారే వెన్నెల్లా ఉండిపోవే అలా

కలలోన (లోన, లోన)
నువ్వే
ఇలలోన (లోన, లోన)
నువ్వే
కన్నీటి వరదై (వరదై)
కమ్మేసినావే

మెత్తగా మత్తుగా మల్లెపువ్వా
నీ చెంపమీద కోటి ముద్దులివ్వ
మెల్లగా చల్లగా చిట్టిగువ్వా
సన్న మూగసైగ చేసే కాలిమువ్వ
నువ్వు ఎదపై పడుకుంటే
నిను ఊపే ఊయల నేనౌతా
చిరునవ్వే వరమిస్తే
నీ పెదవిని చినుకై తడిపేస్తా
ఓ... మృదుపాదం నీవంటా
ఓ... నేలను నేనంటా

నీలి నీలి కన్నుల నిండిపోవే ఇలా
జాలువారే వెన్నెల్లా ఉండిపోవే అలా

కలలోన నువ్వే (కలలోన)
ఇలలోన నువ్వే (ఇలలోన)
కన్నీటి వరదై (కన్నీటి)
కమ్మేసినావే (కమ్మేసినావే)



Credits
Writer(s): Kandikonda, Chakri
Lyrics powered by www.musixmatch.com

Link