Osi Manasa Niku Thelusa

ఓసి మనసా నీకు తెలుసా
మూగ కనుల ఈ గుస గుస
ఎద లోయల్లోన సాగింది కొత్త తాకిడి
తనువంతా వేణువూదింది కన్నె ఊపిరి
ఈ లావాదేవి ఏనాటిది ఓ ఓ హో
ఓసి వయసా ఇంత అలుసా
నీకు తగునా ఈ గుస గుస
మరుమల్లెల్లోన పుట్టింది కొత్త ఆవిరి
మసకేసే ముందే సాగింది గుండె దోపిడి
ఈ గిల్లి కజ్జా ఏనాటిది ఓహో హో హో
ఓసి మనసా నీకు తెలుసా

నింగి నేలా వంగి పొంగి సయ్యాటాడే ఎందుకోసమో
చూపులో సూర్యుడే పండిన సందెలో
కొండాకోన, వాగువంక తుళ్ళింతాడే ఎంత మోహమో
ఏటిలో వీణలే పాడిన చిందులో
తొలిగా గిలిగిలిగా అలిగే వేళలో
పసి తుమ్మెదొచ్చి వాలింది గుమ్మ తేనెకి
సిరితీగ పాప ఊగేది తీపి కాటుకే
అహ ప్రేమో ఏమో ఈ లాహిరి... ఓ హో హో
ఓసి వయసా ఇంత అలుసా

తుళ్ళి తుళ్ళి తూనీగాడే పూతీగల్లో ఎందుకోసమో
గాలిలో ఈలలా, పూలలో తావిలా
హోయ్ మల్లిజాజి మందారాలా పుప్పొల్లాడే ఏమి మాసమో
కొమ్మలో కోయిల రాగమే తీయగా
ఒడిలో అలజడిలే పెరిగే వేళలో
కనుపాపలాడుకుంటాయి కౌగిలింతల్లో
చిరునిద్దరైన పోవాలి కొత్త చింతల్లో
ఈడొచ్చాక ఇంతే మరి... ఆహా హాహా
ఓసి మనసా నీకు తెలుసా
నీకు తగునా ఈ గుస గుస
ఎద లోయల్లోన సాగింది కొత్త తాకిడి
మసకేసే ముందే సాగింది గుండె దోపిడి
ఈ లావాదేవి ఏనాటిది ఓ ఓ హో
ఓసి వయసా ఇంత అలుసా
ఓసి మనసా నీకు తెలుసా



Credits
Writer(s): Veturi, Laxmikant Pyarelal
Lyrics powered by www.musixmatch.com

Link