Pravahame

ప్రవాహమే. గంగా ప్రవాహమే.
స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతేతి కాళికే
పలికే కుహు గీతికా
గాన సరసీ రుహ మాలికా

స్వర రాగ గంగా ప్రవాహమే

గమపని గమపని గమపని గమపని
మపనిస మపనిస మపనిస మపనిస
పని సగమగసని సనిపమ పగమమసా.
కుండల లోపల నిండిన నింగిలో
ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో

కురిసెను రాగం ఈ నాటికి
మట్టింటి రాయే మాణిక్యమయిపోయె
సంగీత రత్నాకరానా.
స్వర సప్తకాలే కెరటాలు కాగా
ఆ గంగ పొంగింది లోనా
స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతేతి కాళికే
పలికే కుహు గీతికా

గాన సరసీ రుహ మాలికా
స్వర రాగ గంగా ప్రవాహమే

దని సని గస గస గస గస
మగ మగ మగ మగ పమ పమ
నిప నిప సని సని ఆ. ఆ. ఆ... ఆ...
చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి
వినిపించు రాగాలననంతాలులే
ఈ చక్ర వాకాలు ఎగిరే చకోరాలు
జగమంత విహరించు రాగాలులే
పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు
పులకింతలా పుష్య రాగాలులే
మలి సంధ్య దీపాలు గుడి గంట నాదాలు
మౌనాక్షరీ గాన వేదాలులే
స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతేతి కాళికే
పలికే కుహు గీతికా
గాన సరసీ రుహ మాలికా
స్వర రాగ గంగా ప్రవాహమే
స్వర రాగ గంగా ప్రవాహమే



Credits
Writer(s): Shyam, Chunakkara
Lyrics powered by www.musixmatch.com

Link