Kokilamma Padindhamma

కువూ
కుక్కుకు కుక్కుకు కోకిలమ్మ
పాడిందమ్మా కూ కూ కూ
కోటి ఓటు కోరికమ్మ పలికిందమ్మా
కూ కూ కూ
దిక్కుల్నే డీకొట్టేందుకు కుకూ
చుక్కల్నే చుట్టొచ్చేందుకూ కుకూ
దిక్కుల్నే డీకొట్టేందుకు కుకూ
చుక్కల్నే చుట్టొచ్చేందుకూ కుకూ
దూకుతుంది ఈడు చెలరేగుతుంది నాడు
మబ్బుల మేడలు ఎక్కేటందుకు
కుక్కుకు కుక్కుకు కోకిలమ్మ
పాడిందమ్మా కూ కూ కూ

తరరారే తరరరార

మామిడి మానుకు మల్లెలు పూస్తాయా
వీచే గాలులు గాజుల
చప్పుడు చేస్తాయా
చూసి చూడక పోవే తాతయ్యా
నీకే తెలియనివా ఏ విలువలు చెప్పయ్యా
అనువైన చోట మనసైన జంట
ఏవో తంటాలు పడుతుంటారంట
అమ్మమ్మో
అమ్మమ్మో ఎల్లలన్నీ పెంచి
ఎద ఎల్లువయ్యే వేళ
కళ్యాలెందుకు అల్లరి ఊహలకు
కుక్కుకు కుక్కుకు కోకిలమ్మ
పాడిందమ్మా కూ కూ కూ

పిట్టకు ఎగిరే పాఠం చెప్పాలా
చెర్లో చేపకు ఎవరో ఈతాను చూపాలా
కిన్నెరసానికి కులుకులు నేర్పాలా
వన్నె చిన్నెల రాణికి
వయసే ఉయ్యాలా
జడి వానే వస్తే
పురి విప్పగనేలా
జతగాడే వస్తే అందగించద బాలా
అమ్మమ్మో
అమ్మమ్మో అందమేస్తా చూడు
ఆ చంద్రుడే దిగుతాడు
అందనిదేవిటి నా చిగురాశలకు

కుక్కుకు కుక్కుకు కోకిలమ్మ
పాడిందమ్మా కూ కూ కూ
కోటి ఓటు కోరికమ్మ పలికిందమ్మా
కూ కూ కూ
దిక్కుల్నే డీకొట్టేందుకు కుకూ
చుక్కల్నే చుట్టొచ్చేందుకూ కుకూ
దిక్కుల్నే డీకొట్టేందుకు కుకూ
చుక్కల్నే చుట్టొచ్చేందుకూ కుకూ
దూకుతుంది ఈడు చెలరేగుతుంది నాడు
మబ్బుల మేడలు ఎక్కేటందుకు
కుక్కుకు కుక్కుకు కోకిలమ్మ
పాడిందమ్మా కూ కూ కూ
కో అంటే ఓ అంటూ
కోరికమ్మ పలికిందమ్మా కూ కూ కూ



Credits
Writer(s): Vandemataram Srinivas, Sirivennela Seetha Rama Shastry
Lyrics powered by www.musixmatch.com

Link