Kalakaanidi

కల కానిది విలువైనది
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
కల కానిది విలువైనది
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు

గాలి వీచి పూవుల తీగ నేల వాలిపోగా
గాలి వీచి పూవుల తీగ నేల వాలిపోగా
జాలి వీడి అటులే దాన్ని వదిలివైతువా
చేర దీసి నీరు పోసి చిగురించనీయవా

కల కానిది విలువైనది
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు

అలముకున్న చీకటిలోనే అలమటించనేల
అలముకున్న చీకటిలోనే అలమటించనేల
కలతలకే లొంగిపోయి కలువరించనేల
సాహసమను జ్యొతిని చేకొని సాగిపో

కల కానిది విలువైనది
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు

అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
సోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
సోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏదీ తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీర గుణం

కల కానిది విలువైనది
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
బ్రతుకు బలిచేయకు



Credits
Writer(s): Sri Sri, Pendyala Pendyala
Lyrics powered by www.musixmatch.com

Link