Manasuna

మనసున మనసై
కన్నుల్లో కలలకు వెలుగై
ఊహల్లో ఊగుతోంది నువ్వే

తరగని వరమై
ఎదల్లో సరిగమ స్వరమై
పెదాల్లో పాడుతోంది నువ్వే

నీకు పరిచయమై తొలి ప్రేమ చవిచూశా
నేను పరవశమై హృదయాన్ని పరిచేశా
నువ్వే నా దైవంలా భావించా

మనసున మనసై
కన్నుల్లో కలలకు వెలుగై
ఊహల్లో ఊగుతోంది నువ్వే

ప్రియ జతలో సన్నిధిలో తెలిసెను సంక్రాంతి
చెలి ఒడిలో మనుగడలో దొరికెను సుఖ శాంతి
అడగక ముందే ఆమనిలా కనుల ముందే మెరిశావు
గ్రహణము విడిచే జాబిలిలా తళుకుమంటూ వెలిగావు
ప్రాణంలో ప్రాణంగా నిలిచావు

మనసున మనసై
కన్నుల్లో కలలకు వెలుగై
ఊహల్లో ఊగుతోంది నువ్వే

శిలలాంటి శిథిల వనం చిగురులు తొడిగింది
కలయికతో ప్రణయ రథం పరుగులు తీసింది
పిలిచిన పలికే పెన్నిధిలా వలపు నిధులే పంచావు
అతిథిగా చేరి హారతిలా చలువ చెలిమే చిలికావు
అందించా అర్పించా అణువణువు

మనసున మనసై
కన్నుల్లో కలలకు వెలుగై
ఊహల్లో ఊగుతోంది నువ్వే

నీకు పరిచయమై తొలి ప్రేమ చవిచూశా
నేను పరవశమై హృదయాన్ని పరిచేశా
నువ్వే నా దైవంలా భావించా



Credits
Writer(s): S R Koteswara Rao, K S Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link