Entha Akali Gontivo

ఎంత ఆకలి గొంటివో
నా వేంకట కిషోరా
వకుళనై అన్నము తినిపింతు
ఆరగించరా కడుపారా

నీ జఠరాగ్నినాదమాయే
మొదటి ఘంటారవముగా
నా మమతలాయే నైవేద్యములు
పొంగలి పెరుగన్నములుగా
చెడు దృష్టి నీకు సోకకుండా
గుడి తలుపులు వేసితినయా
మంత్రోక్తముగా ఆరగింపు
చేసితి నా భాగ్యముగా
ఎంత ఆకలి గొంటివో
నా వేంకట కిషోరా
వకుళనై అన్నము తినిపింతు
ఆరగించరా కడుపారా

గోరుముద్దలే పెడతాను
నోరు తెరవరా నా కన్నా
నీకో ముద్దా సిరికో ముద్దా
చివరి ముద్దేమో నాకన్నా
జగన్నాయకా నీ వారగింప
సకల లోకములు శాంతించు
ఈ ప్రసాదములు స్వీకరించు
ఈ భక్తుల జన్మలు తరియించు

ఎంత ఆకలి గొంటివో
నా వేంకట కిషోరా
వకుళనై అన్నము తినిపింతు
ఆరగించరా కడుపారా



Credits
Writer(s): Shobha Raju
Lyrics powered by www.musixmatch.com

Link