Thulli Thulli

తుళ్ళి తుళ్ళి పడుతోంది
తొలకరి వయసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది
తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు
రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది
తొలకరి వయసు
బుగ్గ మీద కెంపులేవో
నిగ్గు లోలికి పోగా
బుగ్గ మీద కెంపులేవో
నిగ్గు లోలికి పోగా
సిగ్గులేవో నాలో
మొగ్గ తొడిగి రాగా
సిగ్గులేవో నాలో
మొగ్గ తొడిగి రాగా
సిరి మల్లెల పందిరి లోనా
నవ మంగళ వేదిక పైనా
సిరి మల్లెల పందిరి లోనా
నవ మంగళ వేదిక పైనా
జరిగేను కళ్యాణ వైభోగమే

తుళ్ళి తుళ్ళి పడుతోంది
తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు
రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది
తొలకరి వయసు
కోరుకున్న వరుడే చేరుకున్న వేళ
కోరుకున్న వరుడే చేరుకున్న వేళ
పొంగి పొంగి తానే చెంగులాగు వేళ
పొంగి పొంగి తానే చెంగులాగు వేళ
చల చల్లగ గంధం పూసి
మెల మెల్లగ కౌగిట దూసి
చల చల్లగ గంధం పూసి
మెల మెల్లగ కౌగిట దూసి
లతవోలే జత కూడి లాలింతునే

తుళ్ళి తుళ్ళి పడుతోంది
తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు
రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది
తొలకరి వయసు
ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో
ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో
తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి
తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి
అతడెంతటి మొనగాడైనా
గిలి గింతల చెలికాడైనా
అతడెంతటి మొనగాడైనా
గిలి గింతల చెలికాడైనా
తొలి రేయి పరువాల బంధింతునే

తుళ్ళి తుళ్ళి పడుతోంది
తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు
రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది
తొలకరి వయసు



Credits
Writer(s): Arudra, Kosaraju, Dr. C Narayana Reddy, S P Kothandapani
Lyrics powered by www.musixmatch.com

Link