Suprabhatha Sundari

సుప్రభాత సుందరి నీవు ఉదయరాగ మంజరి నేను
కలుసుకున్న ప్రతిరోజూ కలలు కన్న తొలిరోజు
సుప్రభాత సుందరి నీవు ఉదయరాగ మంజరి నేను
కలుసుకున్న ప్రతిరోజూ కలలు కన్న తొలిరోజు
కలలు కన్న తొలిరోజు

నా వెలుగులు నలుగే పెడితే నీ జిలుగులు నేనే చూడాలి
నా సొగసులు సెగ పెడుతుంటే నీ మగసిరిను నేనే చూడాలి
నా వెలుగులు నలుగే పెడితే నీ జిలుగులు నేనే చూడాలి
నా సొగసులు సెగ పెడుతుంటే నీ మగసిరిను నేనే చూడాలి
ఈ చూపుల రాపిడిలో ఆ సూర్యుడు ఉదయించాలి
సుప్రభాత సుందరి నీవు ఉదయరాగ మంజరి నేను
కలుసుకున్న ప్రతిరోజూ కలలు కన్న తొలిరోజు

నా పెదవికి దాహం పుడుతుంటే నీ పెదవులు నేనే వెదకాలి
నా వయసే వరదైపోతుంటే నీ వలపే వంతెన వేయాలి
నా పెదవికి దాహం పుడుతుంటే నీ పెదవులు నేనే వెదకాలి
నా వయసే వరదైపోతుంటే నీ వలపే వంతెన వేయాలి
ఈ దిక్కుల కలయికలో ఆ చుక్కలు రవళించాలి
సుప్రభాత సుందరి నీవు ఉదయరాగ మంజరి నేను
కలుసుకున్న ప్రతిరోజూ కలలు కన్న తొలిరోజు
కలలు కన్న తొలిరోజు కలలు కన్న తొలిరోజు



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link