Anadu Eenadu

ఆనాడు ఈనాడు ఏనాడు
ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు
ఆడించాడు ఆడకపోతే పీడించాడు
అడుగుల మడుగులు ఒత్తించాడు మగవాడే
మన పగవాడు

ఆనాడు ఈనాడు ఏనాడు
ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు

ఒకడమ్ముకుపోయాడు
ఒకడడవికి పంపాడు
ఒకడేమో జూదంలో పందెం కాసాడు
తల్లిని చేసి ఒకడేమో తపస్వి అన్నాడు
తండ్రికి భయపడి ఒకడేమో తాగి చచ్చినాడు
ఏ మగవాడు ఏ మగువని మనసున్నదిగా చూసాడు
మగవాడే మన పగవాడు
మగవాడే మన పగవాడు

ఆనాడు ఈనాడు ఏనాడు
ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడ

No

ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు మగవాడు
ప్రేమించాడు దేవత నూవని పూజించాడు
పరువు బ్రతుకు నీవన్నాడు మగవాడే బలి పశువయ్యాడు
ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు మగవాడు

నెత్తిన కూర్చుంది ఒకతి
నెత్తిన తన్నింది ఒకతి
ఒకతేమో శపథం చేసి యుద్ధం చేర్చింది
నాయకురాలై ఒకతేమో నెత్తురు పారించింది
తండ్రికి భయపడి ఒకతేమో ధనాన్ని పెళ్ళాడింది
ఏ మగువైనా మగవాడ్ని మనిషిగా చూసిందా?
మగవాడే బలి పశువయ్యాడు
మగవాడే బలి పశువయ్యాడు

ఆనాడు ఈనాడు ఏనాడు
ఆడదాన్ని ఆట బొమ్మగా చేసాడు మగవాడు

సగమే ఇచ్చి మగువను మొత్తం దోచేస్తాడు మగవాడు
సగమిచ్చాకే సన్యాసయ్ మిగులుతాడు ఈ మగవాడు
యుగయుగాల మీ బానిసే ఆడది
యుగాయుగాల మా శాపమే ఆడది



Credits
Writer(s): Chakravarthi, Acharya Athreya
Lyrics powered by www.musixmatch.com

Link