Aaresukopoyi

ఆరేసుకోబోయి పారేసుకున్నాను
అరె అరె అరె అరె
కోకెత్తుకెళ్లింది కొండగాలి
నువ్వు కొంటె చూపు చూస్తేనే
చలి చలి
చలి చలి హా
చలి చలి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను
అరె అరె అరె అరె
నా లోని అందాలు నీ కన్నులా
ఆరేసుకోనీ సందె వేళ
హే నా పాట ఈ పూట నీ పైటలా
దాచేసుకోనీ తొలి పొంగులా
నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
ఆ నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
నీ జంట నా తీపి
చలిమంట కావాలి
నీ వింత కవ్వింతకే
కాగి పోవాలి
నీ కౌగిలింతలోనే
దాగి పోవాలి

ఆరేసుకోవాల నారేసుకున్నావు
హరి హరి హరి హరి
నీ ఎత్తు తెలిపింది కొండగాలి
నాకు ఉడుకెత్తి పోతోంది
హరి హరి
హరి హరి
హరి హరి
నీ ఒంపులో సొంపులే హరివిల్లు
నీ చూపులో రాపులే విరిజల్లు
ఆ నీ రాక నా వలపు ఏరువాక
నిను తాక నీలి మబ్బు నా కోక
నే రేగి పోవాలి
నేనూగిపోవాలి
నే రేగి పోవాలి
నేనూగిపోవాలి
చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి
ఈ జోడు పులకింతలే
నా పాట కావాలి
ఆ పాట పూబాటగా
నిన్ను చేరుకోవాలి

ఆరేసుకోబోయి పారేసుకున్నాను
అరె హా అరె హా అరె హా అరె హా
నీ ఎత్తు తెలిపింది కొండగాలి
నాకు ఉడుకెత్తి పోతోంది
హరి హరి
హరి హరి
హరి హరి



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link