Aadi Lakshmi

జగములనేలే జగపతి రాణి
అభయములలొసగే ఆదిలక్ష్మి
జగములనేలే జగపతి రాణి
అభయములలొసగే ఆదిలక్ష్మి
ఆదిలక్ష్మి సదా పాలయమాం
ఆదిలక్ష్మి సదా పాలయమాం
ఆదిలక్ష్మి సదా పాలయమాం

ఆదిశేషుపై పవలించి యోగ నిద్రలో
స్థితి చేసెడి హరి
ఆదిశేషుపై పవలించి యోగ నిద్రలో
స్థితి చేసెడి హరి
పాదాలు సేవిస్తూ చిరు నగవులు ఒణికిస్తూ
పాదాలు సేవిస్తూ చిరు నగవులు ఒణికిస్తూ
రమాదేవివై హరికి తోడుగా
జగతిని కాపాడే జనని
రమాదేవివై హరికి తోడుగా
జగతిని కాపాడే జనని
ఆదిలక్ష్మి సదా పాలయమాం
ఆదిలక్ష్మి సదా పాలయమాం
ఆదిలక్ష్మి సదా పాలయమాం
ఆదిలక్ష్మి సదా పాలయమాం

నాలుగు చేతుల మంగళ రూపం
తెల్లని జెండా చల్లని కమలము
చెరియొక చేతా చక్కగ పట్టి
నాలుగు చేతుల మంగళ రూపం
తెల్లని జెండా చల్లని కమలము
చెరియొక చేతా చక్కగ పట్టి
అభయ ముద్రతో అభయములొసగుచూ
వరద ముద్రతో వరములనొసగుచూ
అభయ ముద్రతో అభయములొసగుచూ
వరద ముద్రతో వరములనొసగుచూ
చల్లని చూపుతో మము దీవిస్తూ

నిత్యమోకతినే సేవిస్తూ

చల్లని చూపుతో మము దీవిస్తూ
నిత్యమోకతినే సేవిస్తూ
అదిలక్ష్మిగా వెలసిన తల్లి
ఆదిలక్ష్మి సదా పాలయమాం
ఆదిలక్ష్మి సదా పాలయమాం
ఆదిలక్ష్మి సదా పాలయమాం

చిన్న విత్తనమే మొలకెత్తి
పసిడి పొలాలై ధాన్యమునిచ్చును
లేగ దూడవు మాతగా ఎదిగి
క్షీరామృతములను అందిచును
చిన్న విత్తనమే మొలకెత్తి
పసిడి పొలాలై ధాన్యమునిచ్చును
లేగ దూడవు మాతగా ఎదిగి
క్షీరామృతములను అందిచును
పసి పాపగ పారాడే శిశువు
ఇలను మహాత్ముడిగా వెలుగొందును
పసి పాపగ పారాడే శిశువు
ఇలను మహాత్ముడిగా వెలుగొందును
తుదిలేని నీ కరుణావీక్షణ
జగతిని నిత్యం పెంపొందించును
తుదిలేని నీ కరుణావీక్షణ
జగతిని నిత్యం పెంపొందించును
జగములనేలే జగపతి రాణి
అభయములలొసగే ఆదిలక్ష్మి
జగములనేలే జగపతి రాణి
అభయములలొసగే ఆదిలక్ష్మి
ఆదిలక్ష్మి సదా పాలయమాం
ఆదిలక్ష్మి సదా పాలయమాం
ఆదిలక్ష్మి సదా పాలయమాం

సుమనస వందిత సుందరి మాధవి
చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని
మంజుల భాషిణి వేదనుతే
సుమనస వందిత సుందరి మాధవి
చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని
మంజుల భాషిణి వేదనుతే
పంకజవాసిని దేవ సుపూజిత
సద్గుణ వర్షిణి శాంతియుతే
పంకజవాసిని దేవ సుపూజిత
సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని
ఆదిలక్ష్మి సదా పాలయమాం
జయ జయహే మధుసూదన కామిని
ఆదిలక్ష్మి సదా పాలయమాం
ఆదిలక్ష్మి సదా పాలయమాం
ఆదిలక్ష్మి సదా పాలయమాం



Credits
Writer(s): Gayathri
Lyrics powered by www.musixmatch.com

Link